
బృహత్ భవనాలపై పన్ను వడ్డన
సాక్షి, బెంగళూరు: బస్సు చార్జీలు, కరెంటు చార్జీలు, మద్యం, పాల ధరల పెంపు తర్వాత ప్రజలకు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో బహుళ అంతస్తుల భవనాలకు 1 శాతం సెస్‌ను విధిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గురువారం విధానసౌధలో సీఎం సిద్ధరామయ్య అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరిగింది. ఇందులో బృహత్ భవనాలపై నిర్ణీత పన్ను విధించి వసూలు చేయాలని తీర్మానించారు. అగ్నిమాపక దళ చట్టం ప్రకారం వాణిజ్య కట్టడాలు, పరిశ్రమలు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, అపార్టుమెంట్లు తదితర అన్ని ఎత్తైన భవనాలకు 1 శాతం సెస్‌ను విధించాలని తీర్మానించింది. రాష్ట్రంలో కొత్తగా నిర్మించబోయే భవనాలపై ఈ పన్నును విధిస్తారు. నిర్మాణ వ్యయంలో ఒక శాతాన్ని ప్రభుత్వానికి చెల్లించాలి. ఇవే కాకుండా ఈ కేబినెట్ భేటీలో చాలా అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ మీడియాకు వివరించారు.
నిర్మాణం విలువలో ఒక్క శాతం
మంత్రిమండలిలో తీర్మానం
కొత్తగా నిర్మించబోయే కట్టడాలకే

బృహత్ భవనాలపై పన్ను వడ్డన