
ప్రైవేట్ బస్సు నదిలోకి పల్టీ
● ఒకరు మృతి, 15 మందికి గాయాలు
● ఉత్తర కన్నడ జిల్లాలో దుర్ఘటన
యశవంతపుర: ఉత్తర కన్నడ జిల్లా అంకోలా వద్ద సోమవారం తెల్లవారుజామున ఓ ప్రైవేట్ బస్సు వంతెనపై నుంచి పల్టీ పడింది. ప్రమాదంలో ఒకరు చనిపోగా 15 మందిరి గాయాలయ్యాయి. బెళగావి నుంచి మంగళూరుకు వెళ్తున్న స్లీపర్ బస్సు జాతీయ రహదారి– 63లోని అగసూరు వద్ద అదుపుతప్పి వంతెనపై నుంచి కింద చిన్నపాటి నదిలోకి పడిపోయింది. బస్సులో 20 మంది ప్రయాణికులుండగా బస్సులో చిక్కుకుని ఒకరు మృతి చెందగా 15 మంది గాయపడ్డారు. బాధితులు కేకలు వేయడంతో స్థానికులు, పోలీసులు పరుగున వచ్చి బస్సులో నుంచి బయటకు తీసుకొచ్చారు. క్షతగాత్రులను అంకోలా, మంగళూరు ఆస్పత్రులకు తరలించారు.