
నంది కొండ దారుల్లో భక్తి పరవశం
చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం తాలూకాలోని ప్రఖ్యాత నంది కొండ ప్రదక్షిణను సోమవారం ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కొండ దిగువన దక్షిణ కాశీ అని ప్రఖ్యాతి గాంచిన భోగ నందీశ్వరస్వామి ఆలయానికి తెల్లవారు జాము నుంచి భక్తులు తరలివచ్చారు. అక్కడ స్వామివారికి పూజలు, ప్రదక్షిణలు చేసి తరువాత నందికొండ ప్రదక్షిణనకు నాంది పలికారు.
16 కిలోమీటర్ల పాద యాత్ర
ప్రదక్షిణ సుమారు 16 కిమీటర్ల దూరం కాగా, అన్ని వయసుల భక్తులు నందీశ్వరున్ని జపిస్తూ నడక సాగించారు. దారి మధ్యలో కొందరు దాతలు తాగునీరు, టిఫిన్లు, కాఫీ, టీలను అందజేశారు. చిక్కబళ్లాపురం, దొడ్డబళ్లాపురం, గౌరిబిదనూరు, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు నుంచి అసంఖ్యాకంగా తరలివచ్చారు. కొండ చుట్టూ తిరిగి చివరిగా కోడి బసవణ్ణ ఆలయంలో పూజలుచేసి, తిరిగి భోగనందీశ్వర స్వామి ఆలయానికి వచ్చి విశ్రాంతి తీసుకుని తిరిగి వెళ్లారు. ప్రతి ఏటా ఆషాఢ మాసం చివరి సోమవారంనాడు ఈ ప్రదక్షిణ జరుగుతుంది. ఈ కార్యం వల్ల ఎంతో మనశ్శాంతి లభిస్తుందని, అనేక జబ్బులు నయమవుతాయని భక్తుల నమ్మకం.
ఘనంగా ఆషాఢ మాస గిరి ప్రదక్షిణ
తరలివచ్చిన భక్తులు

నంది కొండ దారుల్లో భక్తి పరవశం