
ఉధృతంగా వర్షాలు
బనశంకరి: రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. కరావళి జిల్లాల్లో వానలు ఉధృతమయ్యే అవకాశం ఉంది, ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు. చిక్కమగళూరు, శివమొగ్గ, హాసన్, కొడగు జిల్లాల్లో రెండు రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ ని ప్రకటించారు. మండ్య, మైసూరు, చామరాజనగర, కోలారు, చిక్కబళ్లాపుర, బెంగళూరునగర– రూరల్, తుమకూరు, గదగ, రాయచూరు, యాదగిరిలో మబ్బులతో కూడిన వాతావరణం ఉంటుందని, వానలు పడవచ్చని రెండు రోజుల పాటు ఎల్లో అలర్ట్‌ని ప్రకటించారు. కరావళి ప్రదేశాల్లో వర్షంతో పాటు పెనుగాలులు వీస్తాయి, మత్య్సకారులు సముద్రంలోకి వెళ్లరాదని వాతావరణశాఖ హెచ్చరించింది.
రాజధానిలో
సోమవారం బెంగళూరు నగరవ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. సాయంత్రం 4 గంటల నుంచి మొదలైంది. జయనగర, జేపీ నగర, పద్మనాభనగర, బసవనగుడి, బన్నేరుఘట్ట, బీటీఎం లేఔట్, సిల్క్‌బోర్డు, కోరమంగల, మడివాళ, బొమ్మనహళ్లి, హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్, కార్పొరేషన్, కేఆర్ మార్కెట్, గాంధీనగర, మెజస్టిక్, కేఆర్.పురం, మహదేవపుర, యశవంతపుర, గోవిందరాజనగర, ఆర్‌ఆర్ నగర, నాయండహళ్లి, కెంగేరి, మల్లేశ్వరం, శివాజీనగర, రామమూర్తినగర , హెబ్బాళ, యలహంక తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. పలుప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయి. సాయంత్రం ఇళ్లకెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు.
బెంగళూరుతో సహా పలు జిల్లాల్లో వానలు

ఉధృతంగా వర్షాలు

ఉధృతంగా వర్షాలు

ఉధృతంగా వర్షాలు