
గ్యారంటీల అమలులో కాంగ్రెస్ సర్కార్ విఫలం
మైసూరు: ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆధ్వర్యంలోని రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గ్యారంటీ పథకాలు అమలు చేయడంలో విఫలమైందని కేంద్రమంత్రి శోభా కరంద్లాజె ఆరోపించారు. శుక్రవారం ఆమె మైసురులోని చాముండికొండకు వెళ్లి చాముండేశ్వరిని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గ్యారంటీలు అమలు చేయకపోగా పన్నుల ద్వారా వచ్చిన నిధులు ఏమవుతున్నాయో అంతుబట్టడం లేదన్నారు. దళితులను బీజేపీ అధ్యక్షుడిగా చేయాలన్న సీఎం సిద్దరామయ్య వ్యాఖ్యలను పాత్రికేయులు ప్రస్తావించగా సిద్దూ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. కుర్చీ కోసం సీఎం, డీసీఎం పోటీ పడుతున్నారన్నారు.