
ఇకపై పారిశుధ్య కార్మికులకు ముఖహాజరు
హుబ్లీ: హుబ్లీ– ధార్వాడ నగర పాలక సంస్థ పారిశుధ్య కార్మికుల హాజరు కోసం ఫేస్ బయోమెట్రిక్ ఏర్పాటు అవుతుంది. ప్రస్తుతం రెండు జోన్లలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. దీన్ని దశల వారీగా అన్ని జోన్‌లలో విస్తరిస్తారు. ప్రస్తుతం ముఖహాజరు వ్యవస్థ అమలు చేయడంలో రాష్ట్రంలో ప్రథమ నగర పాలికెగా హుబ్లీ ధార్వాడ కీర్తి దక్కించుకుంది. సిబ్బంది నిఖర హాజరు రికార్డు సమయానికి అనుగుణంగా వేతనాలు చెల్లింపు, పాలనలో పారిదర్శకత పారిశుద్ధ్య కార్మికుల పనితనాన్ని పెంచే ఉద్దేశంతో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ముఖముద్ర హాజరు వ్యవస్థ అమలు చేస్తున్నారు. పాలికెలోని 82 వార్డుల్లో సేవలు అందిస్తున్న సుమారు 2500 మంది ఆటో, టిప్పర్, డ్రైవర్ల విధుల మెరుగుదలకు, నగరాల స్వచ్ఛతలో సత్ఫలితాలకు పారదర్శక సేవలు అందించే సదుద్దేశంతో ఈ నూతన వ్యవస్థను ఇప్పటికే ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.
కేంద్రం, ఉడాయి నుంచి అనుమతి
ఈ వ్యవస్థకు కేంద్ర సర్కారు, ఉడాయి నుంచి అధికారికంగా అనుమతి తీసుకున్నారు. దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటంటే నికర హాజరు దాఖలు ద్వారా ఆలస్యంగా పనిలోకి వచ్చే వారికి కళ్లెం వేయవచ్చు. సదరు కార్మికులకు సకాలంలో వేతనాలకు దోహద పడుతుంది. కాగిత ఽఆధారిత హాజరు పద్ధతి నుంచి ఇక విముక్తి పాలన సంస్కరణలు కన్నడలో ధ్వని సూచనలు తదితర సులభ వినియోగం, జియో ఫెన్సింగ్ ద్వారా స్థలం ఆధారిత హాజరు ధృవీకరణ వ్యవస్థ ఈ యంత్రంలో అలవరచారు. ఈ విషయమై పాలికె పొడి చెత్త నిర్వహణ విభాగం చీఫ్ ఇంజినీర్ సంతోష్ యర్రంగళి మాట్లాడుతూ ఇది పాలికె మహదాశయ ప్రాజెక్ట్ అన్నారు. కార్మికులు ఇంట్లోనే కూర్చొని హాజరు వేస్తారు. పనిలోకి రారు, పనులు జరగవన్న ఆరోపణలు ఉన్నాయి.
ప్రాజెక్ట్ కోసం 90 మిషన్లు సిద్ధం
దీన్ని కూకటివేళ్లతో పెకలించడానికి ఐటీ విభాగం ద్వారా ఈ ప్రాజెక్ట్ చేపట్టాం. బయోమెట్రిక్ అండ్ ఫేస్ హాజరు తీసుకుంటాం. కొందరు కార్మికుల చేతి రేఖలు సమసిపోయినందు వల్ల ముఖ ముద్ర తీసుకుంటాం. కంటి రెటీనాల నుంచి హాజరు తీసుకుంటామన్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం 90 మిషన్లు కొనుగోలు చేశాము. వీటిలో 30 యంత్రాలు పని ప్రారంభించాయి. కార్మికులు తప్పనిసరిగా రోజులో మూడు సార్లు హాజరు వేయాలి. ఉదయం 6 గంటలకు తాము పని చేసే చోట ఏర్పాటు చేసిన మిషన్ వద్దకు వెళ్లి ముఖముద్ర వేయాలని, అనంతరం 10, 12 గంటల మధ్య కూడా హజరు వేయాలి. అప్పుడు మాత్రమే పూర్తిగా హాజరైనట్లుగా ఆమోదిస్తామన్నారు. అంతేగాక సకాలంలో నిర్ధిష్ట సమయంలో ఈ ప్రక్రియ ముగించాలని సూచించామన్నారు.
టెండర్ ఆహ్వానించి ఆదేశాలు
విజయ్ భజంత్రి, సిద్దలింగ, ఈ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి చేసి ఇచ్చారన్నారు. ఈ వ్యవస్థ అమలు కోసం స్వస్తి ప్రైవేట్ లిమిటెడ్ అనే స్టార్టప్ కంపెనీకి పాలికె ఐటీ విభాగం నుంచి టెండర్ ఆహ్వానించి ఆదేశాలు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో ఇది తొలిసారి అని, ఇది కార్మికులకు చాలా అనుకూలంగా ఉంటుందని ఆ సంఘం జిల్లాధ్యక్షుడు డాక్టర్ విజయ్ గుండ్రాల అభిప్రాయ పడ్డారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ ప్రక్రియ వల్ల ఎంత మంది పనికి వస్తున్నారన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఇది కార్మికుల ఎన్నో ఏళ్ల డిమాండ్ అన్నారు. 2018లో వేలిముద్ర హాజరు అమలు అయింది. ప్రస్తుతం అత్యుధునిక ఫెస్‌రిడిగ్ హాజరు కార్మికుల కోసం అన్ని విధాలైన డాటా అమర్చారు. దీంతో పౌరకార్మికులందరికీ లభించాల్సిన అన్ని వసతులు లభిస్తాయని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో హుబ్లీ ధార్వాడ
నగర పాలికెలో తొలిసారి
ప్రస్తుతం రెండు జోన్లలో ప్రయోగాత్మకంగా అమలు

ఇకపై పారిశుధ్య కార్మికులకు ముఖహాజరు