
యరగేర తాలూకా చేయరూ
రాయచూరు రూరల్: తాలూకాలోని యరగేరను నూతన తాలూకా కేంద్రంగా ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని యరగేర తాలూకా పోరాట సమితి డిమాండ్ చేసింది. శుక్రవారం జెడ్పీ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి శరణ ప్రకాష్ పాటిల్, శాసనసభ్యుడు బసవనగౌడలకు వినతిపత్రాలను సమర్పించి మాట్లాడారు. రాయచూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని యరగేరను తాలూకా కేంద్రంగా ప్రకటించడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు.
కిరీట ప్రాయం
● నవరసాలను పండించి మెప్పించిన జూనియర్
హుబ్లీ: మాజీ మంత్రి, గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్ధన్‌రెడ్డి ఏకై క పుత్రుడు కిరీటి రెడ్డి నటించిన జూనియర్ కన్నడ సినిమా ప్రేక్షకులను విశేషంగా అలరించింది. జంట నగరాల్లోని లక్ష్మీసిటీ ప్రైడ్, పీవీఆర్, సుధా, ధార్వాడలోని విజయ్ థియేటర్లలో ఈ సినిమా శుక్రవారం ఉదయం 10 గంటల నుంచే ప్రదర్శించారు. ప్రేక్షకుల నుంచి విశేషంగా స్పందన లభించింది. రాధాకృష్ణ రెడ్డి దర్శకత్వంలో కన్నడ మేటి నటుడు రవిచంద్రన్, బొమ్మరిల్లు ఫేమ్ జెనిలియా తదితర తారాగణంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో తొలి భాగంలో అల్లరి చేష్టలతో అటు ఫైట్లు, సంభాషణ పలికే తీరులో ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్నారు. రెండో భాగంలో తండ్రి విలువ తెలుసుకున్న కుమారుడిగా, అప్పుడే తెలిసొచ్చిన అక్క జెనీలియాకు తమ్ముడిగా నటించి ప్రేక్షకులను మెప్పించారు. పీటర్ హెయిన్స్ ఫైటింగ్, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, సెఫిల్‌ఖాన్ ఫోటోగ్రఫిలో చిత్రీకరించిన చిత్రంలో నవరసాలు పండించి కుటుంబ తరహా సినిమాలకు ఓ మంచి యువ హీరో అనుభవం ఉన్న వాడిలా చిరంజీవి కిరీటి నటించారని నీలకంఠ శాస్త్రి, వెంకటేష్, బసవరాజ్, అశోక్ తదితర యువకులు, అలాగే పలువురు ఇంజినీరింగ్ విద్యార్థులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.
సముదాయ భవనం
ఏర్పాటుకు వినతి
రాయచూరు రూరల్: నగరంలో మైనార్టీల కోసం సముదాయం భవన్ ఏర్పాటు చేయాలని అంజుమన్ సభ్యులు డిమాండ్ చేశారు. శుక్రవారం జెడ్పీ కార్యాలయం వద్ద రాష్ట్ర మంత్రి శరణ ప్రకాష్ పాటిల్‌కు సమితి నేతలు రజాక్ ఉస్తాద్ వినతిపత్రాన్ని సమర్పించి మాట్లాడారు. సుమారు 4 లక్షల జనాభా కలిగిన మైనార్టీలకు నూతనంగా సముదాయ భవనం నిర్మాణానికి ప్రభుత్వం నిధులు సమకూర్చాలని విన్నవించారు. ఈ సందర్భంగా ఇక్బాల్ అహ్మద్, ఉస్మా, అమీనుల్లా తదితరులు పాల్గొన్నారు.