
ఆన్‌లైన్‌లో రెవెన్యూ పత్రాలు తీసుకోవచ్చు
● దావణగెరె జిల్లాధికారి గంగాధరస్వామి వెల్లడి
బళ్లారి రూరల్ : భూ సంరక్షణ యోజనలో రెవెన్యూ పత్రాలను ప్రజలకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచినట్లు దావణగెరె జిల్లాధికారి గంగాధరస్వామి జి.ఎం.తెలిపారు. శనివారం జిల్లాధికారి కార్యాలయ సభాంగణంలో ఏర్పాటుచేసిన పత్రికాసమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.1.13 కోటి రెవెన్యూ పత్రాలు స్కానింగ్ చేశామన్నారు. ప్రజలకు డిజిటల్ రూపంలోనే పత్రాలు అందుతాయని తెలిపారు. పాత పాణి, ముటేషన్, ల్యాండ్‌గ్రాంట్ రిజిస్ట్రేషన్ తదితర భూమికి సంబంధించిన అన్ని పత్రాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపారు. దావణగెరె తాలూకా కార్యాలయంలో 52,80765, హరహర తాలూ కాలో 1106372, జగుళూరు1323129, హొన్నాళి,11,51723 పత్రాలను స్కానింగ్ చేసినట్లు తెలిపారు. తాలూకా కార్యాలయాల్లో ప్రజలు తమ భూమి పత్రాలను తీసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో అపర జిల్లాధికారి శీలవంత శివకుమార్, మహిళాశిశు సంక్షేమ శాఖ ఉపసంచాలకుడు రాజానాయక్ తాసిల్దార్ ఎం.బి.అశ్వథ పాల్గొన్నారు.