
సంచార నియమాలు పరిశీలించిన కలెక్టర్
బళ్లారి రూరల్ : పెరుగుతున్న ట్రాఫిక్‌తో ప్రమాదాలు అధికమౌతున్న నేపథ్యంలో దావణగెరె జిల్లాధికారి ట్రాఫిక్ కంట్రోలర్‌గా మారారు. దావణగెరె జిల్లాధికారి జీ.ఎం.గంగాధరస్వామి బుధవారం ఉదయం 6 నుంచి 12 గంటల వరకు డెంటల్ కళాశాల రోడ్డు, బాయ్స్ హాస్టల్, స్పోర్ట్స్ హాస్టల్, ఎంసీసీ, బీ బ్లాక్, శ్యామనూరు వర్తుల రోడ్లలో వాహనాలను పరిశీలించి నేమ్‌ప్లేట్ లేని 30 వాహనాలను స్వాధీనం చేసుకొన్నారు. వాహనదారులకు కోర్టు నుంచి నోటీసులు ఇవ్వాలని సూచించారు. ప్రమాదాలు పెరుగుతుండటంతో ట్రాఫిక్ నియమాలు, వాహనాల నేమ్‌ప్లేట్లు, హెల్మెట్, ఆర్సీ, ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. జిల్లాధికారి వెంట ట్రాఫిక్ పోలీసు అధికారులు ఉన్నారు.
నేమ్ ప్లేట్ లేని 30 వాహనాల స్వాధీనం
చోదకులకు కోర్టు ద్వారా నోటీసులుఇవ్వాలని అధికారులకు సూచన