రాయచూరు రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయాలని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధి సమితి డిమాండ్ చేసింది. బుధవారం టిప్పుసుల్తాన్ ఉద్యానవన వనంలో ఆయుర్వేద ఉద్యమం చేపట్టిన అధ్యక్షుడు హఫీజుల్లా మాట్లాడారు. సర్కార్ సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులను ఈ నెలాఖరులోగా భర్తీ చేయాలని కోరారు. విద్యా రంగం పురోభివృద్ధికి సర్కార్ కమిటీలను ఏర్పాటు చేసి దానిని కార్య రూపంలోకి తేవాలన్నారు. సర్కారీ బడుల్లో బెంచీలు, విద్యుత్, మరుగుదొడ్లు, గ్రంథాలయాలు, తాగునీరు, క్రీడా సౌకర్యాలు విద్యార్థులకు ప్యాడ్‌లు అందించేలా చూడాలని కోరుతూ జిల్లాదికారి ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రికి వినతిపత్రం సమర్పించారు.