పలువురు కాంగ్రెస్‌లో చేరిక
బళ్లారిఅర్బన్: నగర ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి సారథ్యంలో శనివారం పలువురు కాంగ్రెస్‌లో చేరారు. 14వ వార్డు యువ ప్రముఖుడు భవాని ప్రసాద్, ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ పార్టీలో అయినా కొత్తగా కార్యకర్తలు చేరడం సహజమేనని, వీరి చేరిక వల్ల పార్టీకి బలం చేకూరుతుందన్నారు. కాంగ్రెస్ అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేసే పార్టీ అన్నారు. నగరాభివృద్ధే తన కల అని, కార్యకర్తలందరినీ ఈ విషయంలో కలుపుకొని పోయి నగరాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. కార్పొరేటర్లు మించు శీన, ప్రభంజన్‌కుమార్, జబ్బార్, మేయర్ నాగమ్మ, ఎం.సుబ్బరాయుడు, హొన్నప్ప, హగరి గోవింద, రమేష్, ఉపేంద్ర, 12వ వార్డు దోణప్ప, బసవరాజ్, అనిల్, రజత్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు శ్రీకారం
నగరంలోని హవంబావిలోని పలు ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి పనులను ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి ప్రారంభించారు. ముఖ్యంగా 34వ వార్డు విద్యానగర రాఘవ ఫోర్ట్ అపార్ట్‌మెంట్ వెనుకభాగం, 6వ క్రాస్ లింక్ రోడ్ల అభివృద్ధికి వివిధ నిధుల ద్వారా రూ.కోటి వ్యయంతో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. మాజీ మేయర్ రాజేశ్వరి, ఆ పార్టీ ప్రముఖులు విష్ణు బోయపాటి, యోగానందరెడ్డి, నాని, అనూప్, మంజు, హర్ష, బీఆర్‌ఎల్ శీన, యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.


