మదన్‌.. కామరాజు | - | Sakshi
Sakshi News home page

మదన్‌.. కామరాజు

Jun 11 2025 11:32 AM | Updated on Jun 11 2025 11:32 AM

మదన్‌.. కామరాజు

మదన్‌.. కామరాజు

యశవంతపుర/శివాజీనగర: మహిళ కనిపిస్తే చాలు అతడు రెచ్చిపోతాడు, అసభ్యంగా ప్రవర్తిస్తాడు. అటువంటి కాముకున్ని బెంగళూరు పులకేశినగర పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడు మదన్‌ (37) ను విచారిస్తున్నారు. అతడు టెక్కీ కావడం గమనార్హం. ఇటీవల ఒంటరిగా వెళుతున్న మహిళకు బలవంతంగా ముద్దు పెట్టాడు, ఆమె దూషించగా ఎవరికై నా చెప్పుకో, ఏమి చేయలేరంటూ దౌర్జన్యం చేశాడు. నగరంలోని వివిధ ఉద్యావనాలు, రోడ్లు, మైదానం తదితరాల్లో వాకింగ్‌ చేసే మహిళలు, యువతులను మదన్‌ ఇలా వేధించినట్లు

విచారణలో తెలిసింది. ఫుడ్‌ స్టాల్‌ ముందున్న యువతికి ముద్దు పెట్టాడు, అదే ప్రాంతంలో వాకింగ్‌ చేస్తున్న మహిళను కౌగిలించుకొని ముద్దు పెట్టి పరారయ్యాడు. బాధితులు ఫిర్యాదు చేయడంతో పులకేశినగర పోలీసులు తీవ్రంగా గాలించగా, బాణసవాడిలో ఉన్నట్లు గుర్తించి అరెస్ట్‌ చేశారు. ఐటీ సంస్థలో పని చేస్తున్న మదన్‌ కొన్ని రోజుల క్రితం పని వదిలేసి అశ్లీల వీడియోలు చూడటం ప్రారంభించి ఇలాంటి చేష్టలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

మహిళలు కనిపిస్తే అల్లరి చేష్టలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement