
నేరేడు పండ్లు వచ్చేశాయ్
సాక్షి,బళ్లారి: అనేక ఔషధ గుణాలున్న అల్లనేరేడు పండ్లు మార్కెట్‌లోకి వచ్చేసాయి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ పండ్లు కాస్తంతా వగరు, తీయగా ఉంటూ నల్లగా నిగనిగ మెరుస్తుంటాయి. చిరు వ్యాపారులు తోపుడు బండ్లలో అల్లనేరేడు పండ్లను ఉంచి విక్రయిస్తున్నారు. సీజన్‌లో వచ్చేఈ పండ్లను కొన్ని రోజులైనా తినాలని వైద్యులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంపొందించే ఈ పండ్లు ముఖ్యంగా షుగర్‌వ్యాధిగ్రస్తులకు రామభాణంలో పనిచేస్తాయని వైద్యులు చెబుతున్నారు.
ఏటా జూన్‌లో..
ఏటా జూన్ ప్రారంభం నుంచి అన్ని ప్రాంతాల్లో కాసరకాయలు, నేరేడికాయలు పండుతాయి. కాసర కాయలుభూమిపైన మొక్కల్లో విరివిగా కాస్తే, నేరేడు కాయలు చెట్లపైభాగంలో కాస్తుంటాయి. ఈ రెండు చక్కెర వ్యాధికి ఎంతో మేలు చేస్తాయి. ప్రస్తుతం వారం రోజులుగా బళ్లారి నగరంలో ఏ వీధుల్లో చూసినా ఈ రెండు కాయలు దర్శనం ఇస్తుండాయి. కాసరకాయల పొలాల్లో గట్టు మీద కాయడంతో వ్యవసాయకూలీలు కోసుకుని వచ్చి రోడ్లులో పెద్ద ఎత్తున అమ్మకాలు సాగిస్తున్నారు. కేజీ కాసర కాయ రూ.150 నుంచి రూ.200 వరకు విక్రయిస్తున్నారు. దాసరనాగేనళ్లిలో కాసర కాయలు విస్తారంగా పండుతున్నాయి. ఈ సీజన్ ముగిసిన తర్వాత నేరేడు, కాసర కాయలు మరో ఏడాది పాటు కనబడే అవకాశాలు తక్కువ. ముఖ్యంగా ఈరెండు కాయలకు ఎలాంటి క్రిమి సంహారక, రసాయన ఎరువులు కూడా వినియోగించరు. సహజంగా పండే ఇలాంటి పండ్లను తినడం వల్ల ఎన్నో పోషకాలుతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి.
అనేక ఆరోగ్య ప్రయోజనాలు
ప్రొటీన్, కాల్షియం, కార్బొహైడ్రట్లు, ఐరన్, మెగ్నీషియం, పాస్పరస్, పొటాషియం, సోడియం, విటమిన్ సి. థయామిన్, విటమిన్ బీ 6 ఈ పండ్లలో లభిస్తాయి. షుగర్‌ను అదుపు చేయడంతోపాటు గుండెకు మేలు చేస్తాయి. స్ట్రోక్ రాకుండా, అధిక రక్తపోటు నివారణకు అల్లనేరేడు పండ్లు దోహదం చేస్తాయి. శ్వాసనాళాలు, ఊపరితిత్తులను శుభ్రం చేస్తుంది. అంతేకాదు చర్మం మిలమిల మెరిసేందుకు ఈ పండ్లు ఉపకరిస్తాయి.
మార్కెట్లలో విరివిగా విక్రయాలు
పండ్లలో అనేక ఔషధ గుణాలు
చక్కెరవ్యాధి నియంత్రణకు రామబాణం