భారీ వర్షంతో టమాటా పంటకు దెబ్బ | - | Sakshi
Sakshi News home page

భారీ వర్షంతో టమాటా పంటకు దెబ్బ

Jun 2 2025 1:53 AM | Updated on Jun 2 2025 1:53 AM

భారీ వర్షంతో టమాటా పంటకు దెబ్బ

భారీ వర్షంతో టమాటా పంటకు దెబ్బ

హొసపేటె: విజయనగర జిల్లా హొసపేటె, కూడ్లిగి, హగరిబొమ్మనహళ్లి, హరపనహళ్లి, హడగలి, కొట్టూరు తాలూకాల్లోని అనేక గ్రామాలకు చెందిన రైతుల పొలంలో వర్షంతో టమాటా పంట దెబ్బతింది. ఇటీవల కురిసిన భారీ వర్షంతో తాలూకాలోని అనేక రైతుల పొలంలో టమాటా పంట దెబ్బతినడంతో కోయకుండా వదిలేశారు. టమాటా ధర పడిపోవడంతో కోత మరింత ఆర్థిక భారం అవుతుందని రైతులు నాగరాజు, హనుమంతప్ప పంటను పొలంలోనే వదిలేశారు. దీంతో ఏపుగా పెరిగిన టమాటా పొలంలో కుళ్లిపోతోంది. ఎకరానికి దాదాపు రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చు చేశారు. అయితే పంట దిగుబడి వచ్చినా మార్కెట్‌లో ధర మాత్రం లేదు. కిలోకు కేవలం రూ.3 నుంచి రూ.4 ల ధరకు అడుగుతున్నారు. దీని వల్ల కూలీ డబ్బులు కూడా గిట్టుబాటు కాకపోవడంతో టమాటాలను పొలంలోనే వదిలేశామని రైతు హనుమంతు విచారం వ్యక్తం చేశారు. వర్షంతో పంటలు దెబ్బతిన్న రైతులకు తగిన పరిహారం అందించడంపై జిల్లా యంత్రాంగం, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు దృష్టి సారించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement