
వైద్య కళాశాలలో రూ.81.21 కోట్ల గోల్‌మాల్
రాయచూరు రూరల్: కలబుర్గిలోని మహదేవప్ప రాంపురె వైద్య(ఎంఆర్‌ఎం) కళాశాలలో రూ.81.21 కోట్ల మేర నిధులు దుర్వినియోగమైనట్లు ఈడీ అధికారుల విచారణలో వెలుగు చూసింది. హైదరాబాద్ కర్ణాటక విద్యా(హెచ్‌కేఈ) సంస్థ ఆధీనంలోని కలబుర్గి మహదేవప్ప రాంపురె వైద్య కళాశాలలో విద్యార్థుల స్టైపెండ్ నిధులను 2018–2024 మధ్య కాలంలో సంస్థ అధ్యక్షుడిగా కొనసాగిన భీమా శంకర్ పాటిల్ బిళగుంది, సుభాష్ జగన్నాథ్‌లపై పీజీ విద్యార్థుల నిధుల దుర్వినియోగం, ఖాళీ చెక్‌లపై విద్యార్థులతో సంతకాలు తీసుకొని డబ్బులు డ్రా చేసుకున్న ఆరోపణలున్నాయి. హెచ్‌కేఈ సొసైటీ మాజీ అధ్యక్షుడు భీమా శంకర్ పాటిల్ బిళగుంది, మాజీ డీన్ ఎస్.ఎం.పాటిల్, లెక్కాధికారి సుభాష్‌చంద్ర జగన్నాథ్‌ల కార్యాలయంలో ఈడీ అధికారులు ఏడు చోట్ల దాడులు జరిపారు. 2018–2024 మధ్య కాలంలో హెచ్‌కేఈ సంస్థ అధ్యక్షుడిగా పని చేసిన భీమా శంకర్ పాటిల్ బిళగుంది సమయంలో 700 మంది ఎంబీబీఎస్ విద్యార్థుల స్టైపెండ్ రూ.81.21 కోట్ల నిధులు విద్యార్థులకు అందించకుండా సొంతానికి వినియోగించడంతో ఈడీ అధికారులు దాడి చేశారు. విద్యార్థుల స్టైపెండ్ విద్యార్థుల బ్యాంక్ ఖాతాలకు కాకుండా చెక్‌ల ద్వారా రిఫండ్ చేయించుకున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి. ఈ విషయంలో కలబుర్గి సీఈఎన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు ఆధారంగా ఈడీ అధికారులు దాడి చేసి విచారణ జరుపుతున్నారు.
విద్యార్థుల స్టైపెండ్ నిధుల దుర్వినియోగం
కలబుర్గి ఎంఆర్‌ఎం కాలేజీలో వెలుగులోకి