అంబేడ్కర్‌ జయంతిలో ఒక్కటైన జంట | - | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ జయంతిలో ఒక్కటైన జంట

Apr 15 2025 12:45 AM | Updated on Apr 15 2025 12:45 AM

అంబేడ

అంబేడ్కర్‌ జయంతిలో ఒక్కటైన జంట

రాయచూరు రూరల్‌ : ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వివాహాలు చేసుకోవడం జరుగుతుంది. కొందరు సామూహికంగా దేవాలయాలు, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో చేసుకుంటారు. అయితే డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేడ్కర్‌ 134వ జయంతి సందర్భంగా ఓ జంట ఒక్కటైంది. సోమవారం అంబేడ్కర్‌ వృత్తం వద్ద అంబేడ్కర్‌ ప్రతిమ ముందు బంతేజాలు, ధర్మభిక్షువులు, ప్రజల సాక్షిగా రాయచూరు నందీశ్వరాలయం వద్ద అయ్యణ్ణ, ఆమె అక్క కూతురు శాంభవి అనే ఓ జంట దండలు మార్చుకుని పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌ పట్టి, భాస్కర్‌, సంతోష్‌, వెంకటేష్‌, విశ్వనాథ్‌ పట్టిలున్నారు.

ఆర్టీపీఎస్‌లో అగ్నిప్రమాదం..భారీ నష్టం

నాలుగో యూనిట్‌లో విద్యుత్‌

ఉత్పత్తికి బ్రేక్‌

రాయచూరు రూరల్‌: రాయచూరు ధర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం(ఆర్టీపీఎస్‌)లో ఆదివారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. నాలుగో యూనిట్‌లో వేసవి తాపం అధికం కావడంతో అగ్ని ప్రమాదం జరిగి జనరేటర్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ పూర్తిగా కాలిపోయింది. దీంతో రూ.కోట్లాది మేర నష్టం సంభవించినట్లు అధికారులు తెలిపారు. మూడు నెలల నుంచి చెడిపోయిన బాయిలర్‌ ట్యూబ్‌ను మార్పు చేసి ఆదివారం ఉదయం దానిని ప్రారంభించారు. ఆకస్మికంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుని ఆర్టీపీఎస్‌లో నాలుగో యూనిట్‌లో 210 మె.వా. విద్యుత్‌ ఉత్పత్తికి ఆటంకం ఎదురైంది.

వైభవంగా రామలింగేశ్వర రథోత్సవం

రాయచూరు రూరల్‌: నగరంలోని ఐబీ రోడ్డులో రామలింగేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. ఆదివారం రాత్రి వేలాది మంది భక్తుల సమక్షంలో రథోత్సవం నిర్వహించారు. నగరంలో వెలసిన రామలింగేశ్వర ఆలయంలో సోమవారపేట మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్య, శాంతమల్ల శివాచార్య, వీరసంగమేశ్వర శివాచార్య ప్రత్యేక పూజలు నెరవేర్చారు. రథోత్సవంలో వీరశైవ సమాజం జిల్లాధ్యక్షుడు శరణు భూపాల నాడగౌడ, కల్లయ్య, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సభా వేదికపైకి దూసుకెళ్లి హల్‌చల్‌

రాయచూరు రూరల్‌: రాయచూరు జిల్లా లింగసూగూరులో ఆదివారం రాత్రి హిందూ సామ్రాజ్యోత్సవ కార్యక్రమంలో సభా వేదికపైకి ఉన్నఫళంగా ఓ వ్యక్తి దూసుకెళ్లి హల్‌చల్‌ చేసిన ఘటన సంభవించింది. విజయపుర శాసన సభ్యుడు బసవనగౌడ పాటిల్‌ యత్నాళ్‌ మాట్లాడుతుండగా శ్రీనివాస్‌ పూజారి అనే వ్యక్తి కత్తి పట్టుకొని వేదికను అలంకరించడంతో అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. సమావేశంలో గందరగోళం రేపిన శ్రీనివాస్‌ను పోలీసులు పట్టుకొని విచారణ చేపట్టినట్లు అదనపు ఎస్పీ హరీష్‌ తెలిపారు.

కమిషనర్‌, ఎస్‌ఐలపై ప్రశంసలు

హుబ్లీ: ఇంటి ముందు ఆడుకుంటున్న 5 ఏళ్ల చిన్నారిపై లైంగిక దాడి చేసి, ఆపై హత్య చేసిన నిందితుడిని ఎన్‌కౌంటర్‌లో హతం చేయడంపై పోలీస్‌ కమిషనర్‌ శశికుమార్‌, తుపాకీతో కాల్పులు జరిపిన అశోక్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ అన్నపూర్ణలపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సోషల్‌ మీడియా ఎక్స్‌ ఖాతాలో ట్వీట్‌ చేసిన ప్రముఖ నటుడు ధృవసర్జ ఈ అధికారులిద్దరిని అభినందిస్తూ వారి బృందానికి అభినందనలు తెలిపారు. ఇలాంటి కిరాతకాలకు పాల్పడే సంఘ విద్రోహ శక్తులకు ఎన్‌కౌంటర్‌ ద్వారా హెచ్చరిక జారీ చేసినట్లయిందని ధృవసర్జ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

అంబేడ్కర్‌ జయంతిలో  ఒక్కటైన జంట1
1/3

అంబేడ్కర్‌ జయంతిలో ఒక్కటైన జంట

అంబేడ్కర్‌ జయంతిలో  ఒక్కటైన జంట2
2/3

అంబేడ్కర్‌ జయంతిలో ఒక్కటైన జంట

అంబేడ్కర్‌ జయంతిలో  ఒక్కటైన జంట3
3/3

అంబేడ్కర్‌ జయంతిలో ఒక్కటైన జంట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement