అట్టహాసంగా మహావీర్ జయంతి
తుమకూరు: భగవాన్ మహావీర్ భారత్‌కు మాత్రమే కాదని, ప్రపంచానికే అహింసా తత్వాలను చాటిచెప్పారని భక్తులు కొనియాడారు. గురువారం మహావీర్ జయంతిని రాష్ట్రమంతటా జైనులు అట్టహాసంగా నిర్వహించారు. బెంగళూరులో టౌన్‌హాల్ ముందు నుంచి బైక్‌లు, కార్లు, గుర్రాలను మహిళలు, యువతులు అధిరోహించి ర్యాలీ జరిపారు. పలు నగరాలలో కోలాహలంగా ర్యాలీలు సాగించారు. మహిళలు ఎక్కువసంఖ్యలో పాల్గొన్నారు. తుమకూరులోనూ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ప్రదర్శన సాగింది. భోగ లాలస జీవితం నుంచి బయటకి రావడానికి సత్యం, అహింస, బ్రహ్మచర్యం ముఖ్యమని మహావీరుడు బోధించారని వక్తులు తెలిపారు. ఆయన చెప్పిన అంశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు.
అట్టహాసంగా మహావీర్ జయంతి
అట్టహాసంగా మహావీర్ జయంతి


