హొసపేటె: నగర సర్వతోముఖాభివృద్ధికి నగరసభ సభ్యులు సహకరించాలని విజయనగర ఎమ్మెల్యే హెచ్‌ఆర్ గవియప్ప తెలిపారు. గురువారం నగరసభ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 2025–26వ సంవత్సర బడ్జెట్, నగరసభ సామాన్య సమావేశంలో మొదటి సారిగా ఆయన పాల్గొని మాట్లాడారు. నగరసభ వ్యాప్తిలో ప్రవహిస్తున్న మురుగు నీటిని నేరుగా కెనాల్‌లోకి సరఫరా చేస్తున్న వ్యవస్థను అరికట్టాలని సూచించారు. మురుగు నీటిని కెనాల్‌లోకి పంపించడం ద్వారా నీరు కలుషితం అవుతుందన్నారు. ఈ విషయంపై నగరసభ సభ్యులు, అధికారులు ప్రజల్లో అవగాహన తేవాలని కోరారు. ఇక మీదట వార్డు సభ్యులతో కలిసి వార్డుల అభివృద్ధిపై దృష్టి పెడతామన్నారు. అంతకు ముందు నగర అధ్యక్షులు రూపేష్ కుమార్ మాట్లాడుతూ నగరసభకు వివిధ శాఖల ద్వారా 2025–26వ సంవత్సరపు రూ.10, 81,496 పొదుపు బడ్జెట్‌ను సమర్పించారు. నగరసభ ఉపాధ్యక్షుడు రమేష్‌గుప్తా, స్థాయి సమితి అధ్యక్షులు కిరణ్, నగరసభ కమిషనర్ మనోహర్, వివిధ వార్డుల సభ్యులు పాల్గొన్నారు.