సాక్షి, బళ్లారి: కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో కాంగ్రెస్ సర్కారు తీరుపై, ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ బీజేపీ నాయకులు ఆందోళన, ర్యాలీలు, సీఎం దిష్టిబొమ్మ దహనాలతో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్‌కుమార్ నేతృత్వంలో రాయల్ సర్కిల్ వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు మానవహారం నిర్మించారు. సీఎం దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా పోలీసులు, నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. సర్కారు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తున్నామన్నారు. మైనార్టీలకు సర్కారు 4 శాతం రిజర్వేషన్ కల్పించడంతో పాటు 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడం హేయమైన చర్య అన్నారు. ఎస్సీ నిధులను దుర్వినియోగం చేసి పక్కదారి పట్టించి గ్యారెంటీలకు మళ్లించి పేదల సంక్షేమాన్ని కాలరాస్తున్నారన్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తూ అభివృద్ధి పనులను పక్కనపెట్టిన సర్కారుకు ప్రజలే బుద్ధిచెప్పే రోజులు త్వరలో వస్తాయన్నారు. అనంతరం కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టి వినతిపత్రాన్ని సమర్పించారు. నాయకులు కేఎస్.దివాకర్, గురులింగనగౌడ, హనుమంతప్ప, శ్రీధరగడ్డ బసవలింగనగౌడ పాల్గొన్నారు,
మైనార్టీలకు కాంట్రాక్ట్‌ల్లో రిజర్వేషన్ తగదు
రాయచూరు రూరల్: రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ మైనార్టీలకు ప్రభుత్వ కాంట్రాక్ట్ పనుల్లో 4 శాతం రిజర్వేషన్ ప్రకటించడం తగదని బీజేపీ ఆరోపించింది. సోమవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఆందోళన చేపట్టిన మాజీ జిల్లాధ్యక్షుడు, శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ మాట్లాడారు. రాజ్యాంగంలో అంబేడ్కర్ ఎక్కడా కుల ప్రాతిపదికన పనుల్లో రిజర్వేషన్లు ఇవ్వాలని పేర్కొనలేదన్నారు. సర్కార్ తీసుకున్న నిర్ణయం సరైనది కాదన్నారు. అసెంబ్లీలో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఆరు నెలల పాటు సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పునః సమీక్షించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రూ.39 వేల కోట్లను పంచ గ్యారెంటీలకు మళ్లించడం సరికాదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, ఇతరత్ర అంశాలపై పునః పరిశీలించాలని కోరుతూ అదనపు జిల్లాధికారి శివానందకు వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో మాజీ శాసన సభ్యులు గంగాధర నాయక్, శంకరప్ప, మాజీ ఎంపీ బి.వి.నాయక్, నేతలు వీరనగౌడ, రాఘవేంద్ర, శంకర్‌రెడ్డి, శివ, లలిత, వీరయ్య, నాగరాజ్, నరసింహులు, యల్లప్ప, కరుణాకర్‌రెడ్డిలున్నారు.
ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై నిరసన
హొసపేటె: 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ కార్యకలాపాల నుంచి ఆరు నెలల పాటు సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ విజయనగర జిల్లా బీజేపీ శాఖ స్పీకర్ ఆదేశాలకు వ్యతిరేకంగా సోమవారం నిరసన చేపట్టింది. పటేల్ నగర్‌లోని పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి నిరసన వ్యక్తం చేసి స్పీకర్ ఆదేశంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. స్పీకర్ ఆదేశం ఎమ్మెల్యేల హక్కులను హరించేలా ఉందన్నారు. కనుక స్పీకర్ వెంటనే తన ఉత్తర్వును ఉపసంహరించుకోవాలన్నారు. ప్రభుత్వం తప్పులను బీజేపీ ఎమ్మెల్యేలు ఎత్తి చూపారన్నారు. అనంతరం తహసీల్దార్ శృతికి వినతిపత్రం సమర్పించారు.
ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం
పోలీసులు, నేతల మధ్య వాగ్వాదం
సర్కారు తీరుపై బీజేపీ శ్రేణుల కన్నెర్ర
సర్కారు తీరుపై బీజేపీ శ్రేణుల కన్నెర్ర