తగ్గని కమల్‌ సెగలు | - | Sakshi
Sakshi News home page

తగ్గని కమల్‌ సెగలు

May 30 2025 1:22 AM | Updated on May 30 2025 1:22 AM

తగ్గని కమల్‌ సెగలు

తగ్గని కమల్‌ సెగలు

శివాజీనగర: కన్నడ భాష పుట్టుక గురించి ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ చేసిన వ్యాఖ్యలపై కన్నడిగుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో కమల్‌ సినిమాలను నిషేధించాలని కన్నడ సంఘాలు డిమాండ్‌ చేశాయి. గురువారం కన్నడ చలన చిత్ర వాణిజ్య మండలి నేతలు సమావేశమయ్యారు. నిర్మాత సా.రా గోవిందు మాట్లాడుతూ, కమల్‌ హాసన్‌పై మాకెవరికీ కనికరం లేదు. శుక్రవారంలోగా కమల్‌ హాసన్‌ క్షమాపణ చెప్పకపోతే.. కన్నడనాట ఆయన సినిమాలను విడుదల చేయనివ్వం అని హెచ్చరించారు. ఫిల్మ్‌ చాంబర్‌ అధ్యక్షుడు నరసింహులు మాట్లాడుతూ కన్నడ సంఘలు కమల్‌ సినిమాను బ్యాన్‌ చేయాలని పట్టుబట్టారు. కాబట్టి కమల్‌ హాసన్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. కమల్‌హాసన్‌ చేత క్షమాపణ చెప్పించే ప్రయత్నం చేస్తామని తెలిపారు.

ఆగని నిరసనలు

రాష్ట్రంలో కమల్‌ సినిమాలను నిషేధించాలని కన్నడ సినిమా పంపిణీదారులు కమలాకర్‌ నేతృత్వంలో మరో భేటీ జరిగింది. ఈ సమయంలోనే కొన్ని కన్నడ సంఘాల కార్యకర్తలు ఆఫీసును ముట్టడించేందుకు ప్రయత్నించారు.

క్షమాపణ చెప్పాలని కన్నడ

సంఘాల పట్టు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement