రాయచూరు రూరల్: నకిలీ కరెన్సీ నోట్ల మార్పిడి వ్యవహారంలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు మార్కెట్ యార్డు స్టేషన్ సీఐ మేకా నాగరాజు వెల్లడించారు. గురువారం రాత్రి హైదరాబాద్ రహదారిలో శమ్స్ బిరియాని హోటల్‌లో భోజనం చేసి రూ.500 నకిలీ కరెన్సీ నోట్లను ఇచ్చారు. హోటల్ యజమానికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ కరెన్సీ నోట్లను స్వాధీనపరుచుకొని రమేష్, మంజునాథ్‌లను అరెస్ట్ చేశారు. పిల్లల బ్యాంక్ అని రూ.500 నకిలీ కరెన్సీ నోట్లపై రాయడంతో దొరికి పోయారు.మూడు రోజుల క్రితం రూ.40 లక్షలు మేర నకలీ కరెన్సీ నోట్లు మార్పిడిలో నలుగురిని అరెస్ట్ చేసిన విషయం పాఠకులకు విదితమే.