శివాజీనగర: అధికారులు మమ్మల్ని గౌరవించడం లేదు, దూషిస్తున్నారు, తోసేస్తున్నారు అని పలువురు ఎమ్మెల్యేలు చట్టసభలో వాపోయారు. విధానసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు కాగె, బీజేపీ ఎమ్మెల్యే బపవరాజ మత్తిమోడ్‌లు తమకు జరిగిన పరాభవంపై గోడు వెళ్లబోసుకోగా, సభాహక్కుల కమిటీ విచారణ జరపాలని సభాధ్యక్షుడు యూటీ ఖాదర్ ఆదేశించారు.
జ్ఞానం లేదని దూషించారు: రాజు కాగె
పార్టీలకతీతంగా అనేకమంది ఎమ్మెల్యేలు స్పందిస్తూ అటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముందుగా రాజు కాగె తనకు జరిగిన ఉదంతాన్ని వివరించారు. ఫిబ్రవరి 11న ప్రజా లెక్కపత్రాల కమిటీ భేటీ ముగిసిన తరువాత రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి రాజేంద్రకుమార్ కటారియా వద్దకు వెళ్లాను, నా నియోజకవర్గంలో ఓ భవనం నిర్మాణం పనుల గురించి ప్రస్తావిచాను. కటారియా స్పందిస్తూ జిల్లాధికారులకు జ్ఞానం లేదు, మీకు జ్ఞానం లేదని అవమానంగా మాట్లాడారు, నా మాటకు విలువ ఇవ్వలేదు. దురుసుతనంతో మాట్లాడారు. 25 ఏళ్ల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను. ఇంత దురుసుగా ఏ అధికారీ మాట్లాడలేదు. సర్వాఽధికార ధోరణి సరికాదు, ప్రజల పని చేయడమే అధికారి పని. ప్రజా ప్రతినిధినిని అవమానించిన అధికారికి శిక్షపడాలి. ఆయనను బదిలీ చేయాలని 60 మంది ఎమ్మెల్యేలతో సంతకం చేసి ఫిర్యాదు చేశానని చెప్పారు. జేడీఎస్ ఎమ్మెల్యే ఎం.టీ.కృష్ణప్ప మాట్లాడుతూ, రాజు ఒక్కరికే కాదు, సభలో 224 మంది ఎమ్మెల్యేలకు జరిగిన అవమానమిది. కటారియాపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజా లెక్కపత్రాల కమిటీ అధ్యక్షుడైన ఎమ్మెల్యే సీసీ పాటిల్ మాట్లాడుతూ, రాజు కాగెతో కటారియా సభ్యత లేకుండా చెడు ప్రవర్తన కనబరిచారు. ఆయన మీద చర్యలు తీసుకోవాలన్నారు.
పిలిపించి మాట్లాడుతా: మంత్రి
అసెంబ్లీ, న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ మాట్లాడుతూ ఎమ్మెల్యేలు, సంబంధిత అధికారులు, రెవెన్యూ మంత్రి, కమిటీ అధ్యక్షులను నా కార్యాలయానికి పిలిపించి తగిన నిర్ణయం తీసుకొంటామని చెప్పారు. ఆ అధికారులకు చీవాట్లు పెట్టాలని అశోక్ కోరగా, పలువురు సభ్యులు మద్దతు పలికారు.
ఎదమీద చేయి పెట్టి తోసేశారు
అధికారులపై అసెంబ్లీలో
ఇద్దరు సభ్యుల ఆరోపణలు
పార్టీలకు అతీతంగా మద్దతు
చర్యలు తీసుకోవాలని డిమాండ్
గౌరవం ఇవ్వాలి: సభాపతి
సభాపతి ఖాదర్ మాట్లాడుతూ ఎమ్మెల్యేలు తమకు జరిగిన అవమానం గురించి సభలో తెలిపారు. జీతం, భత్యకంటే గౌరవం కావాలనేది ప్రజలు ఆకాంక్షిస్తారు. మాటల్లో సభ్యత లేకపోతే అధికారి ప్రవర్తనను సహించం. ప్రజా ప్రతినిధులకు గౌరవం ఇవ్వాలి. ఇది సభకు చేసిన పరాభవం. దీనిని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలి, అవకాశం ఇవ్వకూడదు అని ఘాటుగా స్పందించారు.
మరో ఎమ్మెల్యే బసవరాజ్ మత్తిమోడ్ మాట్లాడుతూ తమ నియోజకవర్గ పరిధిలో పురసభ ఎన్నికల సమయంలో అదనపు ఎస్పీ మహేశ్ మోఘణ్ణవర్ నన్ను తోసివేశారు. ఇద్దరు సభ్యులను కిడ్నాప్ చేసేందుకు సహకరించారు. ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వలేదు, నా ఎదపై చేయి వేసి త్రోశారు, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ పక్ష నేత ఆర్.అశోక్ జోక్యం చేసుకుని, అధికార పార్టీవారికి ఒక దెబ్బ తగిలితే, ప్రతిపక్షం వారికి రెండు దెబ్బలు తగిలాయి. అధికారులు గౌరవం ఇవ్వడం లేదంటే అసెంబ్లీ కమిటీని బంద్ చేయండి. అధికారులే రాష్ట్ర భారం తీసుకోమనండి, మేము ఎందుకు అసెంబ్లీకి రావాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్ మాట్లాడుతూ బెళగావిలో లింగాయిత సమావేశం జరిగేటపుడు ఏడీజీపీ చట్టాన్ని ఉల్లంఘించి ప్రవర్తించారు. అటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ అధికారులను బదిలీ చేయాలని కొందరు ఎమ్మెల్యేలు గళమెత్తారు.
ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వట్లేదు
ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వట్లేదు
ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వట్లేదు
ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వట్లేదు