
● 2డీలోకి పంచమసాలిలు
శివాజీనగర: పంచమసాలి లింగాయత్ 2ఏ రిజర్వేషన్ల పోరాటం ఓ పరిష్కార మార్గానికి వచ్చిందని కూడల సంగమ పంచమసాలి జగద్గురు జయ మృత్యుంజయ స్వామి శనివారం తెలిపారు. పంచమసాలిలను వెనుకబడిన వర్గమైన 2ఏకు చేర్చాలని డిమాండ్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం మంత్రి మండలిలో ప్రస్తుతమున్న 3బీ నుంచి 2డీకి మార్చిందని ఆయన తెలిపారు. న్యాయసమ్మతమైన రిజర్వేషన్ లభించేవరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. లింగాయత్ సముదాయపు ఇతర వర్గాలకు 7 శాతం రిజర్వేషన్ కల్పించగా, ఉప కులాలు ఈ రిజర్వేషన్ పొందేందుకు సహకరిస్తుందన్నారు. అనేక పోరాటాలను తెలుసుకొని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సుదీర్ఘంగా చర్చించి భరోసానిచ్చారు. అదే ప్రకారంగా నేడు రిజర్వేషన్ కల్పించారని తెలిపారు.
బంగారం దొరికితే ఇచ్చేశారు
తుమకూరు: దారిలో దొరికిన బంగారు చెవిపోగులను యజమానికి అందించి ఇద్దరు వ్యక్తులు తమ నిజాయితీని చాటుకున్నారు. ఈ ఘటన హుళియారు పట్టణ పంచాయతీలో జరిగింది. హుళియారు హోబళి మరనడుపాళ్యకు చెందిన శ్యామరాజు ఓ నగల షాపులో రూ. 60 వేలు విలువ చేసే బంగారు చెవిపోగులను కొన్నాడు. అదే దారిలో వెళుతున్న సాధిక్, నిర్వాణస్వామి అనే వ్యక్తులకు ఆ చెవిపోగులు దొరికితే, దానిపై ఉన్న నగల షాపు పేరు ఆధారంగా షాపులో అప్పగించారు. షాపు యజమాని శ్యామరాజుకు కాల్ చేసి వాటిని తిరిగి అప్పగించారు.
న్యూస్‌రీల్