
ఏసీ మంజునాథ్
దొడ్డబళ్లాపురం: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని రామనగర జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ (ఏసీ) మంజునాథ్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మంజునాథ్ అవినీతిపై ఫిర్యాదులు అందడంతో 2022 మార్చ్ 15న రామనగర ఏసీబీ అధికారులు మంజునాథ్‌కు సంబంధించిన ఆస్తులపై దాడి చేసారు. మొత్తం రూ.9.43 కోట్ల ఆస్తులు వెలుగు చూసాయి. ఆదాయానికి మించి రూ.6.45 కోట్ల ఆస్తులు అదనంగా ఉన్నట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు. జీతభత్యాల కంటే ఈ ఆస్తుల విలువ 216 శాతం ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో మంజునాథ్‌ను ఉద్యోగంలో కొనసాగిస్తే కేసుపై ప్రభావం పడుతుందని భావించి ఆయనను ఒక సంవత్సరంపాటు సర్కారు సస్పెండ్ చేసింది. గతంలో మంజునాథ్ బెంగళూరు రూరల్ దొడ్డబళ్లాపురం సబ్‌డివిజన్ ఏసీగా పనిచేసారు. అప్పుడు కూడా ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు రావడం గమనార్హం.