బ్యాంక్‌ రుణాలు తిరిగి చెల్లించండి

మాట్లాడుతున్న బసవరాజ్‌ స్వామి - Sakshi

రాయచూరు రూరల్‌: జిల్లాలోని ప్రాఽథమిక వ్యవసాయ సహకార బ్యాంక్‌ నుంచి రైతులు తీసుకున్న దీర్ఘకాలిక రుణాలను మార్చి 31లోగా చెల్లించాలని ప్రాఽథమిక వ్యవసాయ సహకార బ్యాంక్‌ అధ్యక్షుడు బసవరాజ్‌ స్వామి కోరారు. మంగళవారం ఆయన పాత్రికేయుల భవనంలో విలేకరులతో మాట్లాడారు. రైతులు బ్యాంక్‌ నుంచి తీసుకున్న పాత రుణాలను ఈనెలాఖరులోగా చెల్లిస్తే 8 శాతం వడ్డీతో ఒన్‌ టైమ్‌ సెటిల్మెంట్‌తో చెల్లించడానికి కేంద్ర సహకార బ్యాంక్‌ అవకాశం కల్పించిందన్నారు. అందువల్ల రైతులు సకాలంలో రుణాలను తిరిగి చెల్లించాలన్నారు.

సెంట్రల్‌ జైల్లో పోలీసు తనిఖీలు

బళ్లారిఅర్బన్‌: నగరంలోని ఎస్పీ కార్యాలయం వెనుకభాగంలో గల సెంట్రల్‌ జైల్లో మంగళవారం జిల్లా ఎస్పీ రంజిత్‌కుమార్‌ బండారుతో పాటు సిటీ డీఎస్పీ బసవరాజ్‌, సీఐలు శ్రీనివాస్‌ మేటి, సిద్దరామేశ్వర, ఎంఎన్‌.సింధూర, వాసుకుమార్‌, బసవరాజ్‌ పాటిల్‌, గుండూరావ్‌, అంబరేశ్‌ హుబ్బళ్లి, అమోఘ్‌, గోవింద్‌ తమ సిబ్బందితో ఉదయం 6.30 నుంచి 8.30 వరకు తనిఖీలను చేపట్టారు. జైల్‌ అధికారులు లత, అంబరీశ్‌ పూజారి, సిబ్బందితో పాటు ఖైదీలను విచారించారు. జైల్‌లో ఖైదీలు వాడుతున్న మొబైల్‌ ఫోన్లు, సిమ్‌ కార్డులను, గంజాయి, సిగరెట్‌ తదితర పొగాకు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు సిటీ డీఎస్పీ బసవరాజ్‌ తెలిపారు.

మేనిఫెస్టోలో విద్యను చేర్చాలి

బళ్లారి రూరల్‌ : రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో విద్యారంగ అభివృద్ధికి చేపట్టే చర్యలను చేర్చాలని ఎస్‌ఐఓ(స్టూటెంట్స్‌ ఇస్లామిక్‌ ఆర్గనైజేషన్‌) కర్ణాటక ప్రణాళిక సమితి సభ్యుడు హుసేన్‌బాషా తెలిపారు. మంగళవారం పత్రికా భవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు, డిజిటల్‌, ఇంటర్‌నెట్‌ వసతులు కల్పించాలన్నారు. పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలన్నారు. పేద విద్యార్థులకు సకాలంలో ఉపకార వేతనాలు అందించి విద్యారంగ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. సమావేశంలో విద్యార్థి సంఘం ప్రముఖులు ఒమర్‌ అహ్మద్‌, లతీఫ్‌బాషా, మహ్మద్‌ అమర్‌, సుమన్‌ అలీ, సోహైల్‌ అమర్‌ పాల్గొన్నారు.

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top