నివేదికను అమలు చేయాలి

ర్యాలీ నిర్వహిస్తున్న కార్యకర్తలు - Sakshi

రాయచూరు రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం సదాశివ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలని సామాజిక న్యాయం, ఎస్సీ రిజర్వేషన్‌ పోరాట సమితి డిమాండ్‌ చేసింది. మంగళవారం అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద చేపట్టిన ర్యాలీనుద్దేశించి రాష్ట్ర సంచాలకులు రాజు మాట్లాడారు. ఏబీసీడీలుగా ఎస్సీల వర్గీకరణపై నిర్లక్ష్యం వహిస్తే పోరాటం తప్పదన్నారు. నగరసభల్లో విధులు నిర్వహిస్తున్న 43 వేల మంది పౌరకార్మికులు, డ్రైవర్లను పర్మినెంట్‌ చేయాలని స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.

భక్తిశ్రద్ధలతో అమావాస్య పూజలు

బళ్లారిఅర్బన్‌: ఉగాది పర్వదినం సందర్భంగా మంగళవారం అమావాస్య ధార్మిక పూజలను ఆయా ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. దుర్గమ్మ ఆలయంలో అమ్మవారికి బంగారు ఆభరణాలతో అలంకరణ చేసినట్లు ఈఓ హనుమంతప్ప తెలిపారు. ఉదయం అమ్మవారికి ఉగాది పచ్చడితో ప్రత్యేక పూజ, ముగ్గుల పోటీలు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, పంచాంగ పఠనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అల్లీపుర మహదేవ తాత మఠంలో అమావాస్య పూజలను విశేషంగా నిర్వహించారు. సీతారామ ఆంజనేయ స్వామి, లక్ష్మీ వేంకటేశ్వర స్వామి, గణపతి ఆలయాల్లోనూ అమావాస్య పూజలను చేశారు.

Read latest Karnataka News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top