‘దళితబంధు ఒక డ్రామా..’ | Ellandakunta Congress Incharge Comments On CM KCR In Karimnagar | Sakshi
Sakshi News home page

‘దళితబంధు ఒక డ్రామా..’

Jul 26 2021 7:26 AM | Updated on Jul 26 2021 7:26 AM

Ellandakunta Congress Incharge Comments On CM KCR In Karimnagar - Sakshi

మాట్లాడుతున్న మేడిపల్లి సత్యం

సాక్షి, ఇల్లందకుంట(కరీంనగర్‌): మొదటి నుంచి సీఎం కేసీఆర్‌ దళితులను మోసం చేస్తూ వస్తున్నారని, ప్రస్తుతం దళితబంధు అంటూ కొత్త డ్రామాకు తెరలేపారని ఇల్లందకుంట కాంగ్రెస్‌ ఎన్నికల ఇన్‌చార్జి మేడిపల్లి సత్యం విమర్శించారు. మండల కేంద్రంలో ఆదివారం ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు జరిగిన నాటి నుంచి నేటి వరకు దళితులను ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకుంటోందని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్‌ పార్టీ పట్ల విధేయతను చూపించాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర పీసీసీ కార్యదర్శి మహిపాల్‌రెడ్డి, కిసాన్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పత్తి కృష్ణారెడ్డి, ఆంజనేయులు, పెద్దికుమార్, రామారావు, శ్రీధర్‌రెడ్డి, శ్రీను, సంపత్, ఓదెలు, దిలీప్, మహేందర్, వంశీ, తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement