సమాజంలో ఆత్మహత్యల నివారణకు కేవలం నిషేధం సరిపోదు. అవగాహన పెంపు, రైతులకు ఆర్థిక భరోసా వంటి చర్యలు కొనసాగాలి. గ్రామీణ స్థాయిలో కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం, సంక్షోభ సమయంలో సహాయం అందించే వ్యవస్థలు బలోపేతం చేయడం అత్యవసరం. కుటుంబ సభ్యులు, గ్రామ పెద్దలు బాధితులను గుర్తించి సహాయం అందించడంలో కీలక పాత్ర పోషించాలి. ఇప్పుడు తీసుకున్న ఈ తాత్కాలిక నిషేధం శాశ్వతంగా మారాలి. దేశవ్యాప్తంగా పారాక్వాట్‌పై పూర్తి నిషేధం అమలు చేస్తేనే దీని వల్ల జరిగే ప్రాణనష్టాలను పూర్తిగా అరికట్టవచ్చు. – డాక్టర్ బీఎన్ రావు,
ఐఎంఏ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు


