వృద్ధురాలి హత్య | - | Sakshi
Sakshi News home page

వృద్ధురాలి హత్య

Apr 15 2026 8:02 AM | Updated on Apr 15 2026 8:02 AM

సిరిసిల్లఅర్బన్‌: ఓ వృద్ధురాలిని దారుణంగా హత్య చేసిన ఘటన సిరిసిల్ల మున్సిపల్‌ పరిధి 24వ వార్డు రాజీవ్‌నగర్‌లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. వృద్ధురాలు కోన లక్ష్మి (75)కి ముగ్గురు కుమారులు ఉండగా ఒకరు చనిపోయారు. ఇద్దరిలో ఒకరు వేములవాడ, మరొకరు సిరిసిల్ల పట్టణంలోని సర్ధార్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. లక్ష్మి రాజీవ్‌నగర్‌లో ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో చిన్న కుమారుడు వెంకటేశ్‌ మంగళవారం సాయంత్రం తల్లి వద్దకు రాగా, అచేతనంగా పడి ఉంది. దగ్గరికి వెళ్లి చూడగా దుండగులు గొంతులో కత్తితో పొడవడంతో రక్తపు మడుగులో మృతిచెంది కనిపించింది. వెంటనే పోలీసులు సమాచారం అందించాడు. హత్య ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ప్రాణం తీసిన చేపలవేట

జూలపల్లి: పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వ డ్కాపూర్‌ గ్రామంలో చేపలవేట నిండు ప్రాణం బలి గొంది. గ్రామానికి చెందిన సయ్యద్‌ ఖాసీం పాషా (31) తన మిత్రులు పాట కుల రాజమల్లు, గుండేటి స్వామితో కలిసి మంగళవారం మధ్యాహ్నం సమీపంలోని హుస్సేన్‌మియా వాగులో చేపల వేటకు వెళ్లారు. సమీపంలోని విద్యుత్‌ మో టారు నుంచి కనెక్షన్‌ తీసుకుని కరెంటుతో చేపలు పట్టేందుకు యత్నించారు. ఒక్కసారిగా కరెంటు షాక్‌ వచ్చి చేపలు పడుతున్న సయ్యద్‌ ఖాసీం పాషా కుప్పకూలి పోయాడు. గమనించిన మిత్రులు వెంటనే పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానాకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి తల్లి ఆజీజా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సనత్‌కుమార్‌ తెలిపారు.

వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి

కరీంనగర్‌క్రైం: నగరంలోని ఓ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతిచెందిందని మృతురాలి కుటుంబ సభ్యులు టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. రాజన్న సిరిసిల్ల జిల్లా శాత్రాజుపల్లి గ్రామానికి చెందిన సాహెబ్‌ బి (62)ని ఈనెల 10న గుండె సంబంధిత వ్యాధి నిమిత్తం ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెకు పరీక్షలు చేిసిన వైద్యులు గుండెలో వాల్స్‌ బ్లాక్‌ అయ్యాయని, వెంటనే ఆపరేషన్‌ చేయాలని కుటుంబ సభ్యులకు సూచించారు. మంగళవారం ఆపరేషన్‌ చేసి బయటకు వచ్చిన తర్వాత కొద్దిసేపటికి ఆమె మృతి చెందింది. మృతురాలి కుమారుడు ఎండీ గౌస్‌ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మిస్సింగ్‌ కేసు నమోదు

గన్నేరువరం: మండలంలోని జంగపల్లి గ్రామానికి చెందిన చెందిక ఖాత లక్ష్మయ్య కనబడటం లేదని అతని భార్య పద్మ మంగళవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై నరేందర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 8వ తేదీన ఇంట్లో గొడవ పెట్టుకుని వెళ్లిపోయాడని, అప్పటి నుంచి అతని ఆచూకీ లభించడం లేదని పేర్కొన్నట్లు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement