జమ్మికుంట: జమ్మికుంట మార్కెట్‌లో క్వింటాల్ పత్తి రూ.8,050 పలికింది. సోమవారం మార్కెట్‌కు 58 క్వింటాళ్ల పత్తిని రైతులు అమ్మకానికి తెచ్చారు. మంగళవారం అంబేద్కర్ జ యంతి సందర్భంగా సెలవు ఉంటుందని, బుధవారం యథావిధిగా కొనుగోళ్లు జరుగుతాయని మార్కెట్ చైర్ పర్సన్ పూల్లూరి స్వప్న, ఇన్‌చార్జి కార్యదర్శి రాజా తెలిపారు.
కో ఆప్షన్‌కు ఒక దరఖాస్తు
కరీంనగర్ కార్పొరేషన్: కో ఆప్షన్ ఎన్నికలకు తొలి దరఖాస్తు వచ్చింది. బీఆర్‌ఎస్‌కు చెందిన అజీమ్ మహమ్మద్ మైనార్టీ కోటాలో సోమవారం కో ఆప్షన్ పదవికి దరఖాస్తు ఇచ్చారు. కాగా మంగళవారం సెలవు రోజైనప్పటికి దరఖాస్తులు తీసుకుంటారని అధికారులు తెలిపారు. దరఖాస్తులకు 16వ తేదీ చివరి రోజు కావడంతో, ఆ రోజు దరఖాస్తులు అధికంగా వచ్చే అవకాశం ఉంది.


