నాకు ఆగస్టు 9, 2015న గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో పాప జన్మించింది. కొన్ని రోజులకు నా భర్తకు రోడ్డు ప్రమాదంలో తలకు గాయం కాగా ప్రతిమ ఆస్పత్రిలో చికిత్స చేయించాం. నా భర్త బంధువు లత వచ్చి కూతురితో ఇబ్బంది ఉంటుంది. నేను చూసుకుంటా అని బలవంతంగా తీసుకెళ్లింది. 4నెలలకు వెళ్లి కలిస్తే పాప లేదని చెప్పారు. కరీంనగర్ త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే పాపను బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. బాలల సంరక్షణ కేంద్రం వారు మా పాపను మాకు ఇవ్వడం లేదు. డీఎన్‌ఏ టెస్ట్ చేసుకోండని చెప్పినా వినడం లేదు.
– స్రవంతి, గోదావరిఖని


