కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థలో తాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు మిడ్‌మానేరు నుంచి ఎల్‌ఎండీకి మూడు టీఎంసీల నీటిని విడుదల చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. ఎల్‌ఎండీలో నీటిమట్టం తగ్గడంతో ప్రస్తుతం రోజు విడిచి రోజు నీటి సరఫరా చేస్తున్నారని, సరిపడా నీరు ఉంచేలా చూడాలని కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, కార్పొరేటర్ వైద్యుల అంజన్‌కుమార్ సోమవారం హైదరాబాద్‌లో మంత్రికి వినతిపత్రం అందజేశారు. స్పందించిన పొన్నం నీటిపారుదలశాఖ సెక్రటరీకి ఫోన్ చేసి ఎల్‌ఎండీలో తాగునీటి సరఫరాకు సరిపడా నీటిమట్టం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మిడ్‌మానేరు నుంచి ఎల్‌ఎండీకి మూడు టీఎంసీల నీటిని విడుదల చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాశారు. పొన్నంను కలిసిన వారిలో అర్బన్ బ్యాంక్‌చైర్మన్ కర్ర రాజశేఖర్, హౌస్‌ఫెడ్ చైర్మన్ బొమ్మ శ్రీరాంచక్రవర్తి, వీర దేవేందర్ ఉన్నారు.
నాణ్యమైన విద్యుత్ సరఫరా అందిస్తాం
కొత్తపల్లి(కరీంనగర్): నిరంతర విద్యుత్ సరఫ రా లక్ష్యంగా సేవలు అందిస్తున్నట్లు టీజీఎన్‌పీడీసీఎల్ కరీంనగర్ సర్కిల్ ఎస్‌ఈ ఆర్.రవీందర్ తె లిపారు. వేసవికాలంలో నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో కృషి చేస్తున్నట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. 2024–25 ఆర్థిక సంవత్సరంతో 2025–26 సంవత్సరం పోల్చితే విద్యు త్ సరఫరా వ్యవస్థలో గణనీయమైన మెరుగుదల కనిపించిందన్నారు. 11 కేవీ బ్రేక్‌డౌన్స్ 41.4 శాతం తగ్గగా, ట్రిప్పింగ్స్ 4 శాతం తగ్గిందన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల వైఫల్యాలు 23.2 శాతానికి తగ్గాయన్నారు. ఓవర్‌లోడ్ సమస్యలను నివారించేందుకు 352 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు, 14 పవర్ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయడంతో పాటు కొత్తగా 4 సబ్‌స్టేషన్లు ప్రారంభించామని, మరో 12 సబ్‌స్టేషన్లు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. వినియోగదారులు తమ సమస్యలను టోల్ ఫ్రీ నంబర్ 1912 ద్వారా నమోదు చేయవచ్చన్నారు.
కరీంనగర్‌రూరల్: సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన న్యాయం అందించాలనే లక్ష్యంతో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఙాన సదస్సులు నిర్వహిస్తున్న ట్లు సంస్ధ సభ్యులు, న్యాయవాదులు ఎ.కిరణ్ కుమార్, పెరుక రంగయ్య, చిట్టి చంద్రప్రకాశ్‌రెడ్డి తెలిపారు. సోమవారం కరీంనగర్ మండలం నగునూరులోని సాంఘిక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో న్యాయ విజ్ఙాన సదస్సు నిర్వహించారు. అంబేద్కర్ ఆశించిన సామాజిక న్యాయం సిద్ధించాలంటే విద్యార్థులు చట్టాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రిన్సిపాల్ మాలతి, సూపరింటెండెంట్ సురేశ్, న్యాయవాది ఆనందభాస్కర్, వసుమతి పాల్గొన్నారు.
కరీంనగర్‌క్రైం: పోలీసు జీతాల కుంభకోణం కేసులో హెడ్‌కానిస్టేబుల్ రాంమోహన్‌ను సస్పెండ్ చేసినట్లు సమాచారం. నిందితుల కస్టడీకి వన్‌టౌన్ పోలీసులు పిటిషన్ వేసినట్లు తెలిసింది. కస్టడీకి తీసుకుని దర్యాప్తు చేస్తే ఇందులో ఇంకా ఎవరి సహకారం ఉంది, ఏఏ స్థాయి అధికారుల హస్తం ఉందనే విషయాలు వెల్లడవుతాయని పోలీసులు భావిస్తున్నారు. కరీంనగర్ ఘటన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో జీతాలపై విచారణ కొనసాగుతోందని సమాచారం.
కరీంనగర్ అర్బన్: వానాకాలం సీజన్ విత్తనాలపై ఈ నెల 15న కలెక్టరేట్ ఆడిటోరియంలో సమీక్షా సమావేశం జరగనుంది. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ సుంకెట అన్వేష్‌రెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష జరగనుండగా ఉమ్మడి జిల్లా అధికారులు పాల్గొననున్నారు.


