డంప్‌యార్డ్‌ సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

డంప్‌యార్డ్‌ సమస్య శాశ్వత పరిష్కారానికి కృషి

Apr 14 2026 7:52 AM | Updated on Apr 14 2026 7:52 AM

● మూడు రోజుల్లో మంటలు అదుపులోకి తేవాలి ● నిధుల కోసం సీడీఎంఏకు విన్నపం ● మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: డంప్‌ యార్డ్‌ సమస్య శాశ్వ త పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ తెలిపారు. సోమవారం డంప్‌యార్డ్‌ను సందర్శించారు. డంప్‌యార్డ్‌లో మంటలు, పొగను వాటర్‌ట్యాంకర్ల ద్వారా మూడు రోజుల్లో అదుపుచేయాలని అధికారులను ఆదేశించారు. బయోమైనింగ్‌ ప్రక్రియను పరిశీలించారు. పనుల్లో జాప్యంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రతి రోజు 150 నుంచి 180 మెట్రిక్‌ టన్నుల చెత్త చేరుతుండటంతో, పాత చెత్తను త్వరగా తొలగించాలని సూచించారు. డంప్‌ యార్డు ప్రక్షాలనకు 15 వ ఆర్థిక సంఘం, స్వచ్చ భారత్‌ మిషన్‌ నుండి మరిన్ని నిధులు విడుదల చేయాలని సీడీఎంకు లేఖ రాసినట్లు తెలిపారు.

డ్యాంలో సరిపడా నీరు ఉండేలా చర్యలు

ఎల్‌ఎండీలో నగర ప్రజల తాగునీటి సరఫరాకు సరిపడా నీటిమట్టం ఉండేలా చర్యలు తీసుకోవాలని మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ నీటిపారుదలశాఖ అధికారులను కోరారు. ఈ మేరకు నీటిపారుదలశాఖకు లేఖ రాసినట్లు వెల్లడించారు. సోమవారం నగరంలోని ఫిల్టర్‌ బెడ్‌ను సందర్శించారు. నీటి శుద్ధీకరణ కేంద్రంలో 34, 14 ఎంఎల్‌డీ నీటి సంపులు, ఫిల్టరేషన్‌ బెడ్‌లు, మోటారు పంపులను, ల్యాబ్‌ లో నీటి నాణ్యతను తనిఖీ చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకం అమత్‌ కింద నగరంలో నూతనంగా నిర్మిస్తున్న వాటర్‌ సంపులు, రిజర్వాయర్‌ పనులను పరిశీలించారు. పనుల్లో జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించారు. కార్పొరేటర్లు పడిశెట్టి వసంత లక్ష్మి, మాసం గణేశ్‌, చంద్ర, ఎస్‌ఈ రాజ్‌ కుమార్‌, డీఈ దేవేందర్‌, ఏఈ బీంవర్థన్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement