అర్జీలను నిర్లక్ష్యం చేస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

అర్జీలను నిర్లక్ష్యం చేస్తే చర్యలు

Apr 14 2026 7:52 AM | Updated on Apr 14 2026 7:52 AM

● ప్రతీ దరఖాస్తుపై తక్షణ స్పందన ● ప్రజావాణిలో కలెక్టర్‌ చిత్రా మిశ్రా

కరీంనగర్‌ అర్బన్‌: ప్రజావాణికి వచ్చే ప్రతీ అర్జీపై నిశిత పరిశీలన చేసి పరిష్కరించాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలని సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణిలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేందుకు చొరవ చూపారు. ప్రధానంగా భూ సమస్యలు, పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, నివేసన స్థలాలు తతదితర అర్జీలు రాగా మొత్తంగా 229 అర్జీలు వచ్చాయని కలెక్టరేట్‌ ఏవో గడ్డం సుధాకర్‌ వివరించారు. అదనపు కలెక్టర్లు లక్ష్మికిరణ్‌, అశ్విని తానాజీ వాకడే, ఆర్డీవోలు మహేశ్వర్‌, రమేశ్‌బాబు, డీఆర్డీవో శ్రీధర్‌ పాల్గొన్నారు.

మొత్తం అర్జీలు: 229

ఎక్కువగా కరీంనగర్‌ కార్పొరేషన్‌: 63

కరీంనగర్‌ రూరల్‌ తహసీల్దార్‌: 15

గంగాధర తహసీల్దార్‌: 13

కొత్తపల్లి తహసీల్దార్‌: 09

ఆర్డీవో, కరీంనగర్‌: 10

Advertisement
 
Advertisement
Advertisement