రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇవ్వాలి

Apr 6 2026 7:54 AM | Updated on Apr 6 2026 7:54 AM

● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌

● కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌

కరీంనగర్‌/కరీంనగర్‌ కార్పొరేషన్‌/కరీంనగర్‌ కల్చరల్‌: బల్ది యా నూతన పాలకవర్గం నగరాభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తోందని కేంద్రమంత్రి బండి సంజయ్‌ అన్నారు. డంప్‌యార్డ్‌ సమస్య పరిష్కారానికి, పెండింగ్‌ పనుల పూర్తికి అవసరమైన నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్‌ ఇస్తే ఈ సమస్యల పరిష్కారంతో పాటు నగరాభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. ఈ మేరకు నగరంలోని తీగలగుట్టపల్లిలో ఏర్పాటు చేసిన మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌ క్యాంప్‌ కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించారు. ప్రజలకు, పాలకవర్గ సభ్యులకు అందుబాటులో ఉండేందుకు క్యాంపు కార్యాలయం ఉపయోగపడుతుందన్నారు. జగ్జీవన్‌ రామ్‌ జయంతి సందర్భంగా మంచిర్యాల చౌరస్తాలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తన నివాసంపై పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రముఖ కవి డాక్టర్‌ సబ్బని లక్ష్మీనారాయణ రచించిన చారుధాం యాత్ర చారిత్రక కథనాల గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఆయా కార్యక్రమాల్లో నగర డిప్యూటీ మేయర్‌ యాదగిరి సునీల్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ఇంజినీర్‌, కోల అన్నారెడ్డి, సంకేపల్లి నాగేంద్రశర్మ, ఉప్పల రామేశం, వి. జైపాల్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement