ప్రమాదాల ఘాట్‌ రోడ్డు.. | - | Sakshi
Sakshi News home page

ప్రమాదాల ఘాట్‌ రోడ్డు..

Apr 6 2026 7:54 AM | Updated on Apr 6 2026 7:54 AM

పూర్తిస్థాయి రేలింగ్‌ ఏర్పాటు చేయాలి

భక్తుల భద్రతకు చర్యలు

మల్యాల: కొండగట్టు ఘాట్‌రోడ్డు.. ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. రోడ్డు వెంట ప్రమాదకర గుంతలు, లోయలు ఉండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూలమలుపుల వద్ద కనీసం రేలింగ్‌ ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని భక్తులు చెబుతున్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు స్పందిస్తున్నారని, అనంతరం చర్యలు చేపట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో రేలింగ్‌ ఏర్పాటు చేసి ప్రయాణ భద్రత కల్పించాల్సిన ఆవశ్యకత ఉందంటున్నారు.

నిత్యం వేలాది మంది భక్తులు

కొండగట్టులోని శ్రీఆంజనేయస్వామి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఆ మేరకు సౌకర్యాల కల్పనలో అధికారులు చొరవ చూపడం లేదనే విమర్శలున్నాయి. ఘాట్‌రోడ్డు వెంట పలుచోట్ల ఇరువైపులా భారీ గుంతలతోపాటు, రేలింగ్‌ లేకపోవడం ప్రయాణం ప్రమాదకరంగా మారింది.

ప్రమాదం జరిగినప్పుడే..

స్వామివారి ఆలయానికి వెళ్లే ఘాట్‌రోడ్డు వెంట ప్రయాణం ప్రమాదకరంగా మారింది. ప్రమాదాలు జరిగినప్పుడే రక్షణ చర్యలు చేపట్టడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆర్టీసీ బస్సు ప్రమాదం జరిగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన తర్వాత అధికారులు స్పందించారు. ప్రమాదం జరిగిన చోట మూలమలుపు వద్ద భారీగోడ నిర్మాణం చేపట్టారు. పలుచోట్ల రేలింగ్‌ నిర్మాణం చేపట్టినప్పటికి పూర్తిస్థాయిలో లేదు. దీంతో ప్రయాణం ప్రమాకరంగా మారింది. గతంలో వైజంక్షన్‌ నుంచి ఘాట్‌రోడ్డు వెంట వెళ్తున్న లారీకి బ్రేకులు ఫెయిలై మూలమలుపు వద్ద మెట్లదారిపై పడిపోయింది. ఆ సమయంలో బండరాళ్లతో గోడ నిర్మించారు. ఇంకా చాలాచోట్ల గుంతలు బండరాళ్లు ఉన్నాయి. వైజంక్షన్‌ దిగువన ఉనన్నో భారీ గుంత వద్ద వాహనదారులు అదుపు తప్పే అవకాశం ఉంది. ఈ క్రమంలో రక్షణ గోడలు ఏర్పాటు చేయాలని భక్తులు, వాహనదారులు కోరుతున్నారు.

భారీ గుంతలతో ఆందోళనలో భక్తులు

వాహనాలు అదుపు తప్పితే ఇక అంతే..

పూర్తిస్థాయి రేలింగ్‌ ఏర్పాటుతోనే రక్షణ

ఘాట్‌రోడ్డు వెంట పూర్తిస్థాయిలో రేలింగ్‌ ఏర్పాటు చేయాలి. రాత్రివేళల్లో భక్తుల వాహనాలు అదుపు తప్పితే నేరుగా భారీ గుంతలు, లోయలోకి దుసుకెళ్లి ప్రమాదం ఉంది. అధికారులు స్పందించి రేలింగ్‌ నిర్మాణం చేపట్టి, భక్తులకు రక్షణ కల్పించాలి.

ముత్యం శంకర్‌, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వచ్చే భక్తుల ప్ర యాణానికి పూర్తి రక్షణ కల్పి స్తాం. ఇప్పటికే ఘాట్‌రోడ్డు వెంట పలుచోట్ల రేలింగ్‌ ఏ ర్పాటు చేశాం. ప్రమాదకర స్థ లాలు గుర్తించి ఆయా ప్రాంతాల్లో రేలింగ్‌ ఏర్పాటు చేస్తాం. భక్తుల రక్షణ కోసం కృషి చేస్తున్నాం.

– అంజనా రెడ్డి, ఆలయ ఈవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement