ఎస్‌యూ వీసీ ఉమేశ్ కుమార్ ఔట్ సోర్సింగ్, పార్ట్ టైం, ఉద్యోగాల నియామకం, అభివృద్ధి పనుల్లో అక్రమాలకు పాల్పడ్డారు. కొలువుల ఆశ చూపించి పేదల వద్ద రూ.లక్షలు వసూలు చేయడం హేయం. ఆయన వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి. ఫుల్ టైం ఈసీ లేకుండా ప్రొఫెసర్లు నియమించడంపైనా విచారణ జరిపించాలి. – మణికంఠ రెడ్డి, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు
అవన్నీ నిరాధార ఆరోపణలు
శాతవాహన వర్సిటీలో బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతోంది. నేను వచ్చాక వర్సిటీలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టాను. లా, ఇంజినీరింగ్ కాలేజీలు వచ్చాయి. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి. క్యాంపస్‌లో ఔట్‌సోర్సింగ్ పోస్టులు అమ్ముకుంటున్నారన్నది కేవలం నిరాధార ఆరోపణలు. అందులో ఎలాంటి వాస్తవమూ లేదు. – ఉమేశ్‌కుమార్, వైస్ చాన్స్‌లర్


