పెద్దపల్లి: అంగన్‌వాడీ టీచర్ల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యంరావు కోరారు. ఈమేరకు కలెక్టరేట్ ఎదుట అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా చేశారు. ముత్యంరావు మాట్లాడుతూ, 35 ఏళ్లుగా గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్న అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు కనీస వేతనం చెల్లించాలని, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. నాయకులు జ్యోతి, ర్గవి, సుజాత, మేఘమాల, స్వప్న, హేమలత, రాజేశ్వరి ఓదేశ్వరి, చంద్రకళ, స్వప్న, సుమలత, స్వరూప, సునీత, రమ తదితరులు పాల్గొన్నారు.


