తీర్థయాత్రలకు స్పెషల్ లగ్జరీ బస్సులు
కరీంనగర్ టౌన్: తీర్థయాత్రల కోసం ఆర్టీసీ ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సులు నడుపుతోంది. ఇప్పటికే ఆయా పుణ్యక్షేత్రాలకు బస్సు సర్వీసులను ప్రారంభించిన అధికారులు కొత్తగా ఉడిపి, గోకర్ణ, గోవా, కాశీ, అయోధ్య, ప్రయాగ్ రాజ్ దర్శనం కోసం బస్సులు ప్రారంభిస్తున్నట్లు కరీంనగర్–1, 2 డిపోల మేనేజర్లు ఐ.విజయమాధురి, ఎం.శ్రీనివాస్ తెలిపారు. ఈనెల 24న కరీంనగర్–1 డిపోకు చెందిన బస్సు కరీంనగర్ నుంచి మధ్యాహ్నం 2 గంటలకు కాశీ, అయోధ్య, ప్రయాగ్ రాజ్, మైహర్, రామ్ టెక్, చందా మహంకాళి, చిత్రకూట్ తదితర ప్రాంతాల సందర్శన కోసం బయలుదేరుతుందన్నారు. వివరాల కోసం 7382849352, 9959225920, 80746 90491 నంబర్లకు కాల్‌చేయాలని సూచించారు. కరీంనగర్–2 డిపోకు చెందిన బస్సు కరీంనగర్ నుంచి 27న సాయంత్రం 6 గంటలకు హంపి, హరిబేరు, కుక్కి, శృంగేరి, ఉడిపి, మృగేశ్వర్, గోకర్ణ తదితర ఆలయాల సందర్శన కోసం బయలు దేరుతుందని వివరించారు. పెద్దలు, పిల్లల టికెట్ల వివరాలు, ఇతర సమాచారం కోసం 9398658062, 7382850708, 8978383084 నంబర్లకు ఫోన్‌చేయాలని సూచించారు.
నీటిపారుదల ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్‌గా లక్ష్మణ్‌రావు
తిమ్మాపూర్: నీటిపారుదల శాఖ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అడ్‌హక్ కమిటీ కన్వీనర్ టీఎన్జీవోస్ కరీనంగర్ జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణ్‌రావు నియమితులయ్యారు. రాష్ట్ర మేజర్ టెంపుల్ ఎంప్లాయీస్ జేఏసీ కోకన్వీనర్, టీఎన్జీవో రాష్ట్ర కార్యదర్శి ఉపాధ్యాయుల చంద్రశేఖర్ ఎల్‌ఎండీ నీటిపారుదలశాఖ కార్యాలయంలో లక్ష్మణ్‌రావును సత్కరించారు. కొండగట్టు అంజన్న శాలువా కప్పి ప్రసాదం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు గంగారపు రమేశ్ గౌడ్, తిమ్మాపూర్ టీఎన్జీవో యూనిట్ ప్రెసిడెంట్ పోలు కిషన్, కరీంనగర్ జిల్లా అసోషియేట్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, నాయకులు ప్రసాద్, పవన్ పాల్గొన్నారు.
తీర్థయాత్రలకు స్పెషల్ లగ్జరీ బస్సులు


