ఉపాధిహామీని నిర్వీర్యం చేసే కుట్ర
కరీంనగర్ కార్పొరేషన్: మహాత్మాగాంధీ ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం నగరంలోని సుడా చైర్మన్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉపాధిహామీ పథకానికి ఉన్న మహాత్మాగాంధీ పేరును తొలగించడాన్ని ఖండించారు. కేవలం కాంగ్రెస్‌కు పేరు వస్తుందనే కుట్రపూరితంగా మహాత్మాగాంధీ పేరును తొలగించారని ఆరోపించారు. 20 సంవత్సరాలుగా కూలీ రేట్లు, పని దినాలు పెంచని ప్రభుత్వం కొత్త బిల్లు పేరిట నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలు బల్లలు చరచడం కాదని, బిల్లును వ్యతిరేకించాలన్నారు. కాంగ్రెస్ నాయకులు పిట్టల రవీందర్, గుండాటి శ్రీనివాస్‌రెడ్డి, కుర్ర పోచయ్య, దండి రవీందర్, మేకల నర్సయ్య, రమణారెడ్డి, సుదర్శన్, మేరాజ్, మాసుంఖాన్, తోట అంజయ్య, బషీర్, పెద్దిగారి తిరుపతి, కొట్టె ప్రభాకర్, అష్రఫ్, బత్తుల రాజ్‌కుమార్, బషీర్, భారీ, సాయిరాం, ఉప్పరి అజయ్, యోనా తదితరులు పాల్గొన్నారు.


