మేడారం జాతరకు సిద్ధం కావాలి
విద్యానగర్(కరీంనగర్): మేడారం జాతరకు సిద్ధం కావాలని కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పగిడిమర్రి సోలమన్ సూచించారు. కరీంనగర్ ఆర్టీసీ బస్‌స్టేషన్‌లోని సమావేశ మందిరంలో జోన్ పరిధిలోని రీజినల్ మేనేజర్లతో శుక్రవారం సమీక్షించారు. మేడారం జాతరకు వసతులు, సరిపడ బస్సులు, ఇతర రీజియన్ల నుంచి బస్సుల సర్దుబాటు, బస్సుల మరమ్మతు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలన్నారు. జాతర విధుల్లో ఉండేవారు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. కరీంనగర్ జోనల్ హాస్పిటల్ మెడికల్ ఆఫీసర్ ఏవీ.గిరిసింహా రావు ముద్రించిన ‘మేడారం జాతర ఆరోగ్య సూచనలు’ కరపత్రాలు ఆవిష్కరించారు. ఆర్‌ఎంలు బి.రాజు, డి.విజయభాను, టి.జ్యోత్స్న, ఎ.సరిరాం, ఎస్.భవాణీ ప్రసాద్, డిప్యూటీ రీజియన్ మేనేజర్లు పి.మల్లేశం, ఎస్.భూపతిరెడ్డి, ఎస్.మధుసూధన్, పి.మహేశ్, వి.మల్ల య్య, ఎస్.రామయ్య, శ్రీహర్ష పాల్గొన్నారు.
కరీంనగర్: అంతర్జాతీయ సార్వత్రిక ఆరోగ్య కవరేజీ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో శుక్రవారం కరీంనగర్‌లోని ప్రభుత్వ మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ తణుకు మహేశ్ మాట్లాడుతూ సామాన్య ప్రజలకు ఆరోగ్య సంరక్షణ హక్కులు, ప్రభుత్వ ఉచిత ఆరోగ్య పథకాలపై అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యం అన్నారు. పేదరికం, లింగ వివక్షతో ఆరోగ్య సేవలు అందకుండా పోకూడదని, అలాంటివారికి న్యాయసాయం అందించడానికి డీఎల్‌ఎస్‌ఏ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందన్నారు. డీఎంహెచ్‌వో వెంకటరమణ, ఆసుపత్రి సూపరింటెండెంట్ జీ.వీరారెడ్డి, టీబీ ఆఫీసర్ రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
జమ్మికుంట: స్థానిక పత్తి మార్కెట్‌లో క్వింటాల్ పత్తి గరిష్టంగా రూ.7,450 పలికింది. శుక్రవారం మార్కెట్‌కు 212 క్వింటాళ్లను రైతులు అమ్మకానికి తెచ్చారు. మోడల్ ధర రూ.7,200, కనిష్ట ధర రూ.7,000కు వ్యాపారులు కొనుగోలు చేశారు. శని, ఆదివారాలు యార్డుకు సెలవు ఉంటుందని, సోమవారం యథావిధిగా క్రయ విక్రయాలుంటాయని ఇన్‌చార్జి కార్యదర్శి రాజా వివరించారు.
కొత్తపల్లి: 132 కె.వీ.విద్యుత్ లైన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నందున శనివారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 కె.వీ. ఎల్‌టీ లైన్ వావిలాలపల్లి ఫీడర్ పరిధి లోని బూత్‌బంగ్లా, అల్ఫోర్స్ కళాశాల, పోచ మ్మ ఆలయం, గుండు హనుమాన్ ఆలయం, తేజస్ స్కూల్, రెడ్డి ఫంక్షన్ హాల్, సుభాష్‌నగర్ ప్రాంతాలతో పాటు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు భగత్‌నగర్, కట్టరాంపూర్, గౌతమినగర్, శ్రీరాంనగర్ కాలనీ, అంబేద్కర్‌స్టేడియం, ఎల్‌ఐసీ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు టౌన్ 1, 2 ఏడీఈలు పి.శ్రీనివాస్‌గౌడ్, ఎం.లావణ్య తెలిపారు.
ఐదు మండలాల్లో నిషేధాజ్ఞలు
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో ఈనెల 14వ తేదీన రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగే చిగురుమామిడి, గన్నేరువరం, తిమ్మాపూర్, మానకొండూర్, శంకరపట్నం మండలాల్లో పలు నిషేధాజ్ఞలు విధిస్తున్నట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. ఈ ప్రాంతాల్లో ఐదుగురు, అంతకన్నా ఎక్కువ మంది గుమికూడడం నిషేధం అన్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి 14వ తేదీ రాత్రి వరకు ఈ ఆజ్ఞలు అమల్లో ఉంటాయని తెలిపారు. ఉల్లంఘించిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ ఒక ప్రకటనలో హెచ్చరించారు.
మేడారం జాతరకు సిద్ధం కావాలి
మేడారం జాతరకు సిద్ధం కావాలి


