‘స్నేహిత’తో ఆత్మస్థైర్యం
జమ్మికుంట: స్నేహితతో ఆత్మస్థైర్యం పెంపొందుతుందని డీఎంహెచ్‌వో వెంకటరమణ పేర్కొన్నారు. పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో వావిలాల పీహెచ్‌సీ డాక్టర్ వరుణ ఆధ్వర్యంలో మంగళవారం స్నేహిత కార్యక్రమంపై అవగాహన కల్పించారు. గుడ్, బ్యాడ్ టచ్, పోక్సో, వివిధ చట్టాలు, హక్కులను గురించి డీఎంహెచ్‌వో వివరించారు. బాలికల భద్రతపై పోలీసులు, ప్రభుత్వమే కాకుండా తల్లితండ్రులు, విద్యావ్యవస్థ సమానంగా బా ధ్యత తీసుకోవాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో చందు, ఎంఈవో హేమలత, సీడీపీవో సు గుణ, హెచ్‌ఎం సుధాకర్ పాల్గొన్నారు. అనంతరం వావిలాల పీహెచ్‌సీని తనిఖీ చేశారు.
విద్యానగర్(కరీంనగర్): తీర్థయాత్రల ప్రత్యేక టూర్ ప్యాకేజీలో కరీంనగర్–1 డిపో నుంచి ఈనెల 14న బీదర్ జిల్లా నరసింహాస్వామి, బీదర్ పోర్ట్, జరాసంగం, రేజింత్‌కు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ ఐ.విజయ మాధురి తెలి పారు. ఈ బస్సు 14వ తేదీ ఆదివారం ఉద యం 3.30 గంటలకు కరీంనగర్ బస్టాండ్ నుంచి బయల్దేరి దర్శనాల అనంతరం తిరిగి అదే రోజు రాత్రి కరీంనగర్ చేరుకుంటుందని వివరించారు. పెద్దలకు రూ.1400, పిల్లలకు రూ.1,080 టికెట్ ఉంటుందని, వివరాలకు 73828 49352, 99592 25920, 80746 90491 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
కరీంనగర్‌క్రైం: జాతీయ, రాష్ట్ర న్యాయసేవ అధికార సంస్థల ఆదేశాల ప్రకారం జిల్లావ్యాప్తంగా అన్ని కోర్టుల్లో ఈనెల 21న శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్‌చార్జ్ న్యాయమూర్తి రాణి తెలిపారు. ఈ లోక్‌అదాలత్‌లో రాజీ చేయదగిన క్రిమినల్, సివిల్ కేసులు పరిష్కరించనున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. వీటిలో ఫ్యామిలీ కేసులు, మోటార్ ప్రమాద, చెక్‌బౌన్స్, బ్యాంక్, ఫైనాన్స్ కేసులతో పాటు కోర్టుకు రాని కేసులు పరిష్కరించనున్నట్లు తెలిపారు.
కరీంనగర్ అర్బన్: రాష్ట్ర నీటిపారుదల శాఖ అడహక్ కమిటీ కన్వీనర్‌గా టీఎన్జీవోల సంఘం జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణ్‌రావు ని యామకమయ్యారు. ఈ క్రమంలో టీఎన్జీవో జిల్లాశాఖ ఆధ్వర్యంలో మంగళవారం లక్ష్మ ణ్‌రావును ఘనంగా సన్మానించారు. జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా నుండి రాష్ట్ర స్థాయి కీలక బాధ్యతలు చేపట్టే నాయకులుగా ఎదగడం టీఎన్జీవో సంఘానికి గర్వకారణం అన్నారు. వ్యవస్థాపక అధ్యక్షుడు మారం జగదీశ్వర్ గతంలో ఇరిగేష న్‌శాఖ రాష్ట్ర అధ్యక్షుడిగా చూపిన నాయకత్వం స్థానంలో లక్ష్మణరావుకు అవకాశం దక్కడం జిల్లాకు ప్రత్యేక గౌరవమని కొనియాడారు.
జమ్మికుంట: జమ్మికుంటలోని వీణవంక రోడ్డులో ఏర్పాటుచేసిన వైన్స్‌ను ఎత్తి వేయాలని స్థానిక మహిళలు, పలు పార్టీల నాయకులు మంగళవారం ధర్నా చేశారు. విద్యా సంస్థలు, ప్రభుత్వ ఆసుపత్రి ఉన్న రోడ్డులో వైన్స్ నిర్వహణతో విద్యార్థులు, మహిళలు ఇబ్బంది పడతున్నారని అన్నారు. ఈ విషయంపై కలెక్టర్, సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఎస్సై నాగారాజు అక్కడికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. సమస్య పరిష్కరించేలా కృషి చేస్తామని చెప్పడంతో ధర్నా విరమించారు.
‘స్నేహిత’తో ఆత్మస్థైర్యం
‘స్నేహిత’తో ఆత్మస్థైర్యం
‘స్నేహిత’తో ఆత్మస్థైర్యం


