డంప్‌యార్డ్‌లో భారీగా మంటలు˘
కరీంనగర్ కార్పొరేషన్: నగరంలోని డంప్‌యార్డ్‌లో మంటలు చెలరేగాయి. భారీగా చెత్త కుప్పలు తగలబడడం, గంటల పాటు మంటలు కొనసాగడంతో పరిసరాల్లో దట్టమైన పొగ వ్యాపించింది. మంగళవారం సాయంత్రం నుంచి ప్రారంభమైన మంటలు రాత్రి 9గంటల వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతిసారి డంప్‌యార్డ్ మధ్యలో, పక్కన చెత్త కుప్పల్లో మంటలు చెలరేగేవి. ఈ సారి డంప్‌యార్డ్‌లోని మెయిన్‌గేట్ వద్ద చెత్తకుప్పలు తగలబడడం గమనార్హం. అదికూడా గతంలో ఎప్పుడూలేని స్థాయిలో భారీగా మంటలు చెలరేగడంతో, ఆటోనగర్, అలకాపురికాలనీ, కోతిరాంపూర్, కట్టరాంపూర్‌తదితర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రాత్రి నగరపాలకసంస్థ అధికారులు డంప్‌యార్డ్‌కు వెళ్లి, ఫైరింజన్ ద్వారా మంటలను అదుపులోకి తెచ్చారు.


