రూ.1.56 లక్షలు సీజ్
రామగిరి(మంథని): ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న వ్యక్తి నుంచి పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం.. శుక్రవారం లద్నాపూర్ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా మంథనికి చెందిన ఊడిమాడుగుల సురేందర్ వద్ద రూ.1,56,910 నగదు లభించింది. ఆధారాలు చూపించకపోవడంతో సీజ్‌చేసి ఫ్లయింగ్ స్క్వాడ్ ఇన్‌చార్జి అరవింద్‌కు అప్పగించారు.
మానేరులో దూకి వ్యక్తి ఆత్మహత్య
తంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీలో నివసిస్తున్న యెల్లె రమేశ్(42) శుక్రవారం మానేరువాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు. సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన రమేశ్ పవర్‌లూమ్ కార్మికుడిగా పనిచేసేవాడు. ఏడాదిగా పని చేయకుండా మద్యానికి బానిసయ్యాడు. అప్పులు పెరిగిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. మద్యం మానేయలని భార్య లత మందలించడంతో మనస్థాపానికి గురై ఈనెల 3న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. శుక్రవారం తంగళ్లపల్లి మానేరువాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వాగులో మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి భార్య లత ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తంగళ్లపల్లి ఎస్సై ఉపేంద్రచారి తెలిపారు.
రూ.1.56 లక్షలు సీజ్


