కాల్వశ్రీరాంపూర్‌లో 12లో 8మంది..
కాల్వశ్రీరాంపూర్: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలో 24 గ్రామ పంచాయతీల్లో 12 మహిళలకు కేటాయించారు. ఎనిమిది స్థానాల్లో గ్రాడ్యుయేట్లు పోటీలో నిలిచారు. కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన జూకంటి శిరీష ఎంకాం చేశారు. గతంలో ఎంపీటీసీ, వైస్ ఎంపీపీగా సేవలందించారు. ప్రస్తుతం సర్పంచ్ బరిలో నిలిచారు. మీర్జంపేట నుంచి పుప్పాల రాజశ్యామల హృదయ సర్పంచ్‌గా పోటీ చేస్తున్నారు. ఎంకాం పూర్తి చేశారు. ఆరెపల్లి నుంచి సాకర్‌మాన్ విశాల పోటీలో నిలవగా.. బీఎస్సీ కంప్యూటర్ చదివారు. మడిపల్లి నుంచి అడిగొప్పుల రాణి పోటీ చేస్తున్నారు. బీకాం కంప్యూటర్ పూర్తి చేశారు. జాఫర్‌ఖాన్‌పేట నుంచి యాదగిరి జ్యోత్స్న పోటీ చేస్తుండగా ఎంబీఏ ఫైనాన్స్ పూర్తిచేశారు. వెన్నంపల్లి నుంచి ఎంబాడి యశోద బరిలో ఉన్నారు. ఎంబీఏ, బీఎస్సీ చదివారు. పెద్దంపేట నుంచి పోటీ చేస్తున్న దాసరి సునీత బీకాం, సీఏ చదివారు. సర్పంచ్ పోటీకోసం ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చారు.
కాల్వశ్రీరాంపూర్‌లో 12లో 8మంది..


