మెడికల్ కాలేజీకి అనాథ వృద్ధుడి పార్థివదేహం
ఓదెల(పెద్దపల్లి): అనాథ వృద్ధుడు జగదీశ్వర్‌రెడ్డి(70) పార్థివదేహాన్ని శనివారం కరీంనగర్ ప్రతిమ మెడికల్ కాలేజీకి అప్పగించారు. కొంతకాలంగా కరీంనగర్‌లో అనాథగా జీవిస్తున్న జగదీశ్వర్‌రెడ్డి అనారోగ్యం, తీవ్రచలితో మృతిచెందాడు. మృతుడి ఆశయం మేరకు పార్థ్థివదేహాన్ని సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్‌కుమార్, కార్యదర్శి మేరుగు జ్ఞానేంద్రచారి ఆధ్వర్యంలో ప్రతిమ మెడికల్ కాలేజీ అనాటమి హెడ్ డాక్టర్ కిషన్‌రెడ్డికి అప్పగించారు.
ఫ్రిడ్జ్ పేలి రూ.3లక్షల ఆస్తినష్టం
జగిత్యాలజోన్: జగిత్యాలరూరల్ మండలం లక్ష్మిపూర్‌కు చెందిన బుర్రవేణి సమత ఇంట్లో ఫ్రిడ్జ్ పేలి ఆస్తి నష్టం వాటిల్లింది. ఫ్రిడ్జ్ వెనుకవైపు ఉండే సిలిండర్ అకస్మాత్తుగా పేలిపోవడంతో కూలర్, మంచాలు, కట్టుబట్టలు పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనలో రూ.లక్ష నోట్లు కాలి బూడిదయ్యాయి. మొత్తంగా రూ.3 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితురాలు లబోదిబోమంది. బాధితురాలిని ఆదుకోవాలని యువజన సంఘాల అధ్యక్షుడు ఎడమల సత్తిరెడ్డి, గ్రామ పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఎడమల మల్లారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.
మెడికల్ కాలేజీకి అనాథ వృద్ధుడి పార్థివదేహం


