ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా రహదారులపై వేడుకలు జరుపుకోవడం, కత్తులతో ప్రదర్శనలు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పెట్టడం తదితర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠినచర్యలు తప్పవు. అలాంటివారితో శాంతిభద్రతలకు భంగం వాటిల్లే ప్రమాదం నెలకొంటుంది.
– వాసంశెట్టి మాధవి,ఏసీపీ హుజూరాబాద్
పట్టణాల్లోనే కాకుండా గ్రామాల్లో సైతం యువత మత్తుకు బానిసలుగా మారుతున్నారు. సమాజంలో యువత డ్రగ్స్ ఏజెంట్లు, పెడ్లర్స్ నుంచి మత్త పదార్థాలు కొనుగోలు చేసి, జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పోలీస్‌శాఖ ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
– పోతరాజు హరీశ్, హుజూరాబాద్
చర్యలు తప్పవు


