కౌన్సెలింగ్ చేసి పంపిస్తున్నాం
మా ఠాణాకు ఇటీవల ప్రేమజంటలు ఎక్కువగా వస్తున్నాయి. మేజర్లమని చెబుతూ తల్లిదండ్రుల నుంచి రక్షణ కోరుతున్నారు. చట్టం పరిధిలో మేజర్లు ఇష్టపడి పెళ్లి చేసుకుంటే ఏమి చేయలేం. కానీ వారి అమ్మానాన్నలకు, పెళ్లి చేసుకున్న జంటకు కౌన్సెలింగ్ చేస్తున్నాం. మైనరు అమ్మాయిలను తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటే కేసులు నమోదు చేస్తున్నాం. అమ్మాయిలను వారి తల్లిదండ్రులకు అప్పగిస్తున్నాం. జీవితంలో స్థిరపడ్డాక చేసుకునే ప్రేమ పెళ్లిళ్లకు పెద్దల ఆమోదం కూడా లభిస్తుంది. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు సరికావు. – కె.కృష్ణ, సిరిసిల్ల టౌన్ సీఐ


