ఆకట్టుకుంటున్న కళాప్రదర్శన
విద్యానగర్(కరీంనగర్): కరీంనగర్‌లోని రాజరాజేశ్వర కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కళా సిల్క్స్ ప్రదర్శన ఆకట్టుకుంటోంది. దేశంలో ప్రసిద్ధి చెందిన కళాకారులు తయారు చేసిన సిల్క్స్, చేనేత వస్త్రాలతోపాటు గద్వాల్, నారాయణపేట, పోచంపల్లి, ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి, కలాంకరి, ఉప్పడ, అస్సాంలోని మూగా, ఎరిసిల్క్స్, బిహార్‌లోని బాగల్పుర సిల్క్స్, చత్తీస్‌గఢ్‌లోని ట్రిబిల్ వర్క్స్, కోసా సిల్క్, గుజరాత్‌లోని బందని, కచ్చ ఎంబ్రయిడరీ డ్రెస్ మెటిరియల్, హ్యాండ్ క్రాష్ట్స్, న్యూట్రీషన్ ఫుడ్స్, అతివల అలంకరణ వస్తువులు, హోమ్‌ఫుడ్స్, బ్యాంగిల్స్‌తోపాటు వివిధ రకాల కళాఖండాలు ఈ ప్రదర్శనలో ఉన్నాయి.


