
లిక్కర్ దందా
బ్లాక్ దందా నియంత్రిస్తాం
● దసరా రోజు బార్లు, వైన్స్‌లు బంద్ ● బ్లాక్‌లో అమ్మేందుకు సిద్ధమవుతున్న పలువురు వ్యాపారులు
కరీంనగర్‌క్రైం: దసరా పండగ గాంధీ జయంతి రోజు రావడంతో జిల్లా వ్యాప్తంగా వైన్స్‌లు, బార్లు మూసివేయనున్నారు. ఈక్రమంలో దసరా రోజు అక్రమంగా మద్యం అమ్మకాలు జరిపేందుకు బెల్ట్‌షాపులు, వివిధ ప్రైవేటు వ్యాపారులు సిద్ధపడుతున్నారు. దసరా రోజు మూసి ఉంటున్న నేపథ్యంలో పలువురు బ్లాక్‌లో కొంటారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు పలువురు వైన్స్‌లు, బార్ల యజమానులు, పనిచేసేవారు, బయటివారు బ్లాక్ దందాకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కరీంనగర్‌లోని కట్టరాంపూర్, బస్టాండ్ ప్రాంతం, భగత్‌నగర్, తిరుమల్‌నగర్, రాంగనర్, మంచిర్యాల చౌరస్తా, హౌజింగ్‌బోర్డుకాలనీ తదితర ప్రాంతాల్లో బ్లాక్‌లో మద్యం అమ్మకాలు జరుపుతున్నారు. ఇక అల్గునూర్‌లో వైన్స్‌లను మించి బెల్ట్‌షాపులు అమ్మకాలు జరుపుతున్నాయని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కరీంనగర్‌లో వైన్స్‌లు మూసివేసిన సందర్భాల్లో రోజూ అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా అల్గునూర్ బెల్ట్‌షాపుల్లో మద్యం అమ్మకాలు బ్లాక్‌లో జరుగుతున్నాయని సమాచారం. ఈ బెల్ట్‌షాపులపై అల్గునూర్‌కు చెందిన ఒక వ్యక్తి పలుమార్లు పోలీసులకు, ఎకై ్సజ్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో చివరకు సీపీకి ఫిర్యాదు చేయగా సదరు బెల్ట్‌షాపులను మూయించినట్లు తెలిసింది. కానీ, పండుగపూట పోలీసులు, ఎకై ్సజ్ అధికారులు పెద్దగా దృష్టి పెట్టరని భావించి బ్లాక్‌దందాకు తిరిగి తెరలేపడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది.
94 వైన్స్‌లు, 32 బార్లు
గాంధీ జయంతి రోజు దసరా రావడంతో జిల్లావ్యాప్తంగా 94 వైన్స్‌లు, 32 బార్లు మూసివేయనున్నారు. దీంతో బ్లాక్ దందాకు తెరలేపి బుధవారం రాత్రి నుంచే మద్యాన్ని ప్రైవేట్ ప్రాంతాల్లో నిల్వ చేస్తున్నారు. బ్లాక్ దందాలో ఒక బీర్‌కు అదనంగా రూ.50 నుంచి రూ.100, లిక్కర్ విషయానికి వస్తే క్వాటర్‌కు రూ.50 , హాఫ్‌నకు రూ.100, ఫుల్‌బాటిల్‌పై రూ.200 వరకు, బ్రాండ్‌ను బట్టి పెద్ద బ్రాండ్లకు ఫుల్‌బాటిల్‌పై రూ.500 నుంచి రూ.1,000 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. కాగా, దసరా సందర్భంగా చాలా మంది ముందస్తుగా మద్యం కొనుగోలు చేసినా సరిపోనివారు బ్లాక్‌లో కొనుగోలు చేస్తుంటారు. ఇలాంటి వారే లక్ష్యంగా బ్లాక్ దందా కొనసాగుతుంటుందని చర్చ జరుగుతోంది.
దసరా రోజు గాంధీ జయంతి సందర్భంగా వైన్స్‌లు, బార్లు మూసి ఉంటాయి. పలువురు బ్లాక్ దందాకు తెరలేపే అవకాశాలుండడంతో వాటిని నియంత్రిస్తాం. ప్రత్యేక బృందాల ద్వారా నిఘా ఏర్పాటు చేస్తున్నాం. వైన్స్‌లు మూసి ఉన్న సమయంలో బెల్ట్‌షాపులు, ప్రైవేటు దుకాణాల్లో మద్యం అమ్మితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం.
– పి.శ్రీనివాసరావు,
కరీంనగర్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్